Take a fresh look at your lifestyle.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి కృషి

  • రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ ‌పౌర సరఫరాల శాఖ మంత్రి
  • సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి,జూన్‌,02(‌ప్రజాతంత్ర విలేకరి) : తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది కోసం ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ ‌పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్ర ఫలాలను ప్రజలకందిస్తు ఈ ఆరేండ్ల)లో ఎంతో అభివృద్ది సాధించామని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆరవ ఆవతరణ దినోత్సవం సందర్భంగాజిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ ‌మైదానంలో నిర్వహించిన అవతరణ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష ఎస్పీ అపూర్వరావులతో కలిసి ముందుగా వేదిక పక్కన ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఆయన అనంతరం జాతీయ పతాకం ఎగరవేశారు. అనంతరంజిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా మంత్రి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదికను ఆయన ప్రజలముందుంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం అభివృద్ది ఉపాధి పనులను పెద్ద ఎత్తున చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని రైతులకు మార్కెట్లో మంచి డిమాండు కలిగిన పంటలు వేసుకోవాలని అప్పుడే గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఏ పంట వేసుకోవాలో శాస్త్రవేత్తలు గుర్తించే విధంగా రైతులు పంటలు సాగుచేసుకోవాలని చెప్పారు. జిల్లాలో గుర్తించిన 1,30,381 మంది రైతులకు గాను ఇప్పటివరకు 1,03,157న మంది రైతులకు యాసంగి కాలంలో 101కోట్ల86లక్షల71వేల198లను రైతుల ఖాతాలో రైతుబంధును జమ చేయడం జరిగిందన్నారు.

రైతు భీమా పథకంలో జిల్లాలో 351 మంది రైతులు మరణించగ 317 మంది రైతులకు 5లక్షల చొప్పున 15కోట్ల8లక్షలు నామిని ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. వ్వయసాయ మార్కెటింగ్‌ ‌ద్వారా జిల్లాలో 30కోట్ల వ్యయం తో 11వ్యవసాయ మార్కెట్‌ ‌కింద నాబార్డ్ ‌ద్వారా పనులు పూర్తిచేయడం జరిగిందని చెప్పారు. భూమి రికార్డుల శుద్దీకరణ నవీకరణలో భాగంగా భూ ప్రక్షాలన తరువాత మొత్తం 1,74,596 ఖాతాలను శుద్దీకరించి 1,52,004ఖాతాలకు సంబంధించిన రైతులకు పట్టాదారు పాస్‌ ‌పుస్తకం జారీ చేయడం జరిగింది. మిగిలిన ఖాతాలు వివిధ దశలో పురోగతిలో ఉన్నాయని అన్నారు. సాగునీటి ప్రజెక్టుల కొరకు భూసేకరణ చేపట్టామని రిజర్వాయర్‌ల నిర్మాణానికి 4,380 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 4,208 ఎకరాల భూమి సేకరించి 198 కోట్ల సంబంధిత రైతులకు నష్టపరిహారంగా చెల్లించామని చెప్పారు. మిషన్‌ ‌కాకతీయ కింద 30 కోట్ల87లక్షల34వేల అంచనా వ్యయంతో 16చెక్‌డ్యాం ల నిర్మాణానికి ప్రతిపాజనలు పంపగా 10 చెక్‌ ‌డ్యాంలకు నిధులు మంజూరైనట్లు చెప్పారు. మిషన్‌ ‌భగీరథ దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకం కింద జిల్లాలో 316 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టి ఇప్పటి వరకు 175కోట్ల32లక్షల వ్యయం చేయడం జరిగిందన్నారు. వైద్యఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో కేసిఆర్‌ ‌కిట్టు పథకం ద్వారా ఇప్పటి వరకు 11వేల495మంది బాలింతలకు కెసిఆర్‌ ‌కిట్లు ఇస్తు 17కోట్ల31లక్షల24వేలు వారిఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. కెసిఆర్‌ ‌కిట్లు ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య అనుహ్యంగా పెరిగిందని 59.5శాతం కాన్పులు జరగగ ప్రైవేటు ఆసుపత్రిలో 40.5శాతం ప్రసవాలు జరిగినట్లు చెప్పారు. హరితహారంలో జిల్లా వ్యాప్తంగా కోటి67లక్షల మొక్కలు నాటి లక్ష్యనికి 43లక్షల90వేలమొక్కలు వివిధ శాఖల ద్వారా నాటామన్నారు.కళ్యాణ లక్ష్మీ షాదీముబారక్‌ ‌కింద 147 మందికి లక్ష116 రూ.చొప్పున చెక్కులు పంపిణి చేయడం జరిగింది. ఈ ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమల్లో జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. జిల్లా ఉపాధిహామి పథకం ప్రతి ఒక్కరికి 12కిలోల బియ్యం కోవిడ్‌ ‌నేపథ్యంలో 3నెలల పాటు వెనుకబడిన వారికి ఆర్థిక ప్రేరణ ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఆర్డీఓ తో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply