Take a fresh look at your lifestyle.

‌ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు

ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తుందని వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నదే తమ సంకల్పమని రాష్ట్ర ్రఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం నర్సాపూర్‌ ‌నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం దంతాన్‌పల్లి, సికింద్లాపూర్‌ ‌డబుల్‌బెడ్‌రూంల ప్రారంభోత్సవాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పొల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నర్సాపూర్‌ ‌నియోజకవర్గంలనే మొట్టమొదటిసారిగా డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు దంతాన్‌పల్లి, సికింద్లాపూర్‌లో పూర్తయ్యాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నివసించేందుకు ఇంటి నిర్మాణం చేట్టడానికే డబుల్‌బెడ్‌ ‌నిర్మాణాలు చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ‌రైరుల పక్షపాతి అని అందుకుగాను రైతుల కోసం రైతు భీమా రైతుబంధు, ఉచిత కరెంటుతో పాటు ఎన్నొ రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని రైతులకు రుణమాఫీతో పాటు అవసరమైనన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బంఉదలు పడినప్పటికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి వద్ద నుంచి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు నిర్ణీత సమయంలో వారి ఖాతాల్లోకే నేరుగా ధాన్యం డబ్బులను జమచేశామన్నారు. ప్రస్తుతం వర్షాకాలం పంటలకు సైతం రైతు పెట్టుబడి కింద వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేశామని మంత్రి హరీశ్‌రావు వివరించారు.

పీఎంజీఎస్‌వై కింద మొదటి విడతలో నర్సాపూర్‌ ‌నియోజకవర్గానికి రూ.13కోట్లు మంజూరయ్యాయని మంత్రి వివరించారు. అలాగే ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో 22 రోడ్లకు గానూ, రూ.112 కోట్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. నర్సాపూర్‌కు సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.13కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నర్సాపూర్‌ ‌నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు చాలా పూర్తయ్యాయని,, ఇంకా పూర్తి కాని వాటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇదే స్పూర్తితో ప్రతి అభివృద్ధి పనుల్లో నియోజకవర్గాన్ని ముందుంచాలన్నారు. నర్సాపూర్‌లో సబ్‌స్టేషణ్‌ ‌గుండపల్లి నిర్మాణానికి రూ.కోటి యాభైలక్షలతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ ‌ప్రారంభించారు. 24గంటలు నిరంతరాయంగా కరెంటు సరఫరా జరుగుతుందన్నారు. రైతులకు మేలు చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తమ పొలాలు, భూములు అమ్ముకోవద్దని.. కాళేశ్వరం నీళ్ళు వస్తున్నందున రాబోయే రోజుల్లో రైతే రాజు అవుతారయి మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతి రైతు తమకు ఉన్న వ్యవసాయ పొలాలు,భూములు కాపొడుకోవాలని.. దీంతో పాటు అవసరమైన పంటలను సాగు చేసి వారి ఆదాయాన్ని  పెంపొందించుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. అనంతరం గోమారంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారని.. గ్రామాన్ని చూస్తే చుట్టపక్కల పచ్చదనంతో ఎంతో ఆనందరంగా ఉందని ఈ విషయంలో మాజీ సర్పంచ్‌తో పాటు ప్రస్తుత సర్పంచ్‌ ‌లావణ్యను మంత్రి హరీశ్‌రావు అభినందించారు.

ఈ గ్రామానికి ఆదర్శంగా తీసుకొని హరితహారం 100శాతం విజయవంతం కావడానికి కృషి చేయాలన్నారు. గోమారం గ్రామానికి విలేజ్‌ ‌మార్కెట్‌ ఏర్పాటుకు గాను జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు ఎంత పని చేసిన ఇబ్బందిలేదని డబ్బులకు ఏమాత్రం కొరతలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెదక్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి మాట్లాడుతూ దంతాన్‌పల్లిలో కొందరు ఇండ్లు మంజూరు కాలేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అర్హులైన వారందరికి డబుల్‌బెడ్‌రూంలను తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి అన్నారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్‌ ‌నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల్లో కొంత ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. దీనిక కారణం  ఎన్నికలు రాగా అనంతరం కరోనా వైరస్‌ ‌వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పాడ్డాయని అందుకు పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. నర్సాపూర్‌ ‌నియోజకవర్గంలో అర్హులైన వారందరికి డబుల్‌బెడ్‌రూంలను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే మధన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాల్లో మెదక్‌ ‌జడ్పీ చైర్‌పర్సన్‌ ‌హేమలత, నర్సాపూర్‌ ‌మాజీ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌చండ్రాగౌడ్‌, ‌నర్సాపూర్‌ ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌మురళీయాదవ్‌, ‌శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ రమేశ్‌, ‌జడ్పీటీసిలు శేషసాయిరెడ్డి, మెదక్‌ అదనపు కలెక్టర్‌ ‌నగేశ్‌, ‌పంచాయతీరాజ్‌ ఈఈ ‌వెంకటేశ్వర్లు, డీపీవో హనోక్‌, ‌డీఆర్డీఏపీడీ శ్రీనివాస్‌, ఆయా శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply