Take a fresh look at your lifestyle.

హుజూరా‘బాద్‌’ ‌షా ఈటల రాజేందర్‌

  • ఉద్యమనేతకే ప్రజల మద్దతు
  • 23,655 వోట్ల మెజారిటీతో గెలుపు
  • టిఆర్‌ఎస్‌కు, కెసిఆర్‌కు వోటర్ల గట్టి ఝలక్‌
  • ‌బండి చెప్పినట్లుగా అసెంబ్లీలో ట్రిపుల్‌ఆర్‌
  • ‘‌దళితబంధు’ ప్రారంభించిన గ్రామంలోనూ ఈటలకే మెజారిటీ

యుద్ధాన్ని తలపించేలా హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్‌ ‌బాద్‌ ‌షాగా నిలిచారు. వోటర్లు ఈటలకే జైకొట్టారు. 23,655 వోట్ల మెజారిటీతో ఈటల విజయం సాధించారు. ఈటలకు మొత్తం 1,01,732 వోట్లు రాగా ప్రధాన ప్రత్యర్థి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 78,997 వోట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం 2,903 వోట్లు పోలయ్యాయి. కెసిఆర్‌ ‌చాలా ప్రతిషాత్మకంగా తీసుకుని సర్వశక్తులు వొడ్డినా పలితం లేకుండా పోయింది. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీల మధ్యే ప్రధాన పోరు జరిగింది. ఈ విజయంతో ఓ  రకంగా ఈటల బిజెపిని నిలబెడుతున్నారనే చెప్పాలి. ఈటల గెలుపుతో బిజెపికి అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే దుబ్బాకలో రఘునందన్‌ ‌రావు తన సొంత ఇమేజ్‌ ‌తోడవ్వడం వల్లనే గెలిచారని చెప్పాలి. అలాగే రాజాసింగ్‌ ‌కూడా తన సొంత ఇమేజ్‌తో గోషామహల్‌లో గెలిచారు. అదే విధంగా ఇప్పుడు ఈటల కూడా తోడయితే బండి సంజయ్‌ అన్నట్లు ట్రిపుల్‌ ఆర్‌ ‌కనిపించనుంది. అయితే ఈ మూడుచోట్లా ఆయా స్థానిక నేతల వల్ల బిజెపి వెలిగిందే తప్ప..బిజెపి వల్ల వీరు బలపడలేదని గుర్తించాలి.

ఈ విషయం కూడా బిజెపికి తెలియంది కాదు. గత సాధారణ శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో బిజెపికి నోటాకన్నా తక్కువ వోట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈటలతో బిజెపికి వెలుగు వొచ్చిందనే చెప్పాలి. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. హుజురాబాద్‌లో ముక్కోణ పోరు నెలకొన్నప్పటికీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ‌మధ్యనే పోటీ ఉందనే అంచనాలు నిజమవుతున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌.. ఎక్కడా పోటీలో కనిపించడం లేదు. రౌండ్‌ ‌రౌండ్‌కూ వోట్ల లెక్కింపులో ఈ ఇద్దరి మధ్యనే పోటీని స్పష్టం చేశాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చూపిన స్థాయిలో ప్రభావం బల్మూరు వెంకట్‌  ‌చూపలేకపోయారు. అదే  ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌ ‌రెడ్డికి 60 వేలకు పైగా వోట్లను దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్‌ ‌భార్య జమున ఎంతో శ్రమించారు. అలాగే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ‌భార్య శ్వేత కూడా ప్రచారంలో దూసుకుపోయారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ‌తల్లి బల్మూరి పద్మ కూడా ప్రచారం చేశారు. హుజురాబాద్‌ ‌నియోజకవర్గానికి చెందిన నేత ఈటల రాజేందర్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నుంచి 2018 ఎన్నికలలో పోటీ చేసి.

కాంగ్రెస్‌ ‌ప్రత్యర్థి కౌశిక్‌ ‌రెడ్డిపై 43,719 వోట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో..ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల పదవీ స్వీకారం చేశారు. అయితే అసైన్డ్ ‌భూములు కొన్నారనే ఆరోపణలపై 2021లో ఈటల తన పదవికి రాజీనామా చేశారు. అలాగే తన శాసన సభ పదవికి, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, భారతీయ జనతాపార్టీలో చేరారు. ఫలితంగా హుజురాబాద్‌ ‌నియోజకవర్గానికి ఉపఎన్నికలు వొచ్చాయి. హుజురాబాద్‌ ‌నియోజగవర్గంలో గతంలో జరిగిన 6 దఫాల ఎన్నికలలోనూ వరుసగా టీఆర్‌ఎస్‌ ‌విజయం సాధిస్తూ వొచ్చింది. అందులో ఈటల గత 4 దఫాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌నుంచి గెలుస్తూ వొస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేయగా కేవలం 1683 వోట్లు మాత్రమే దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో నోటాకి 2867 వోట్లు వచ్చాయి. అంటే గతంలో బీజేపీ వోట్లు నోటా కంటే తక్కువ వోట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈటల తన ఛరిష్మాతో బిజెపికి ప్రాణం పోశారు. ఇక అంతకుముందు జరిగిన ఎన్నికల విషయానికొస్తే.. 2004లో జరిగిన హుజూరాబాద్‌ ‌శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)‌కి చెందిన కెప్టెన్‌ ‌వి లక్ష్మీకాంతరావు తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెద్దిరెడ్డిపై 44,669 వోట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఆ ఎన్నికల్లో లక్ష్మీకాంతరావుకు 81,121 వోట్లు దక్కగా, పెద్దిరెడ్డికి 36,451 వోట్లు వొచ్చాయి. అలాగే అప్పటి కేంద్ర మంత్రి రాంవిలాస్‌ ‌పాశ్వాన్‌కు చెందిన లోక్‌ ‌జనశక్తి పార్టీ నుంచి పోటీ చేసిన ఇనుగాల భీమారావు 5,281 వోట్లు దక్కించుకున్నారు. ఇక 2009 శాసనసభ ఎన్నికలలో ఈ హుజూరాబాద్‌ ‌నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ ‌తరఫున కృష్ణమోహన్‌, ‌బీజేపీ నుంచి కె.రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో టీఆర్‌ఎస్‌ ‌నుంచి ఈటెల రాజేందర్‌, ‌ప్రజారాజ్యం తరఫున పి.వెంకటేశ్వర్లు, సమతా పార్టీ నుంచి ఇ.భీమారావు, లోక్‌సత్తా పార్టీ నుండి కె.శ్యాంసుందర్‌ ‌తదితరులు పోటీచేశారు. అయితే తెలంగాణ ఉద్యంతో మొదలయిన ఈటెల రాజేందర్‌ ‌ప్రస్తానం అక్కడ సుస్థిరంగా ఉండిపోయింది. కెసిఆర్‌ ‌గతంలో ఎప్పుడు రాజీనామా చేసినా మళ్లీ గెలిచేవారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఇచ్చిన పోటీ గానీ, ఖర్చు పెట్టిన డబ్బులు కానీ గతంలో ఎప్పుడూ కెసిఆర్‌ ‌పోటీ చేసినప్పుడు పెట్టలేదు. దీనిని బల్లి ఈటల అనేక ప్రతికూల పరిస్థితులను త్టటుకుని నిలబడ్డాడనే చెప్పాలి.

‘దళితబంధు’ ప్రారంభించిన గ్రామంలోనూ ఈటలకే మెజారిటీ
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంతో ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌దళితబంధు పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని ముందుగా ఎన్నికల సంగ్రామమైన హుజూరాబాద్‌ ‌నుంచే మొదలు పెట్టారు. ఈ పథకంతో దళితుల వోట్లు తమకే వొస్తాయని కేసీఆర్‌ ‌భావించారు. అయితే హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో దళితబంధు ప్రారంభించిన శాలపల్లి గ్రామంలోనే టీఆర్‌ఎస్‌కు ఆదరణ కరువైంది. శాలపల్లిలో సీఎం కేసీఆర్‌ ‌సభ కూడా పెట్టారు. అయినా శాలపల్లి వోటర్లను టీఆర్‌ఎస్‌ ఆకర్షించలేకపోయింది. శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 135 ‌వోట్ల ఆధిక్యంలో నిలిచారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక మొదటి రౌండ్లో పోతిరెడ్డి పేట, వెంకట్రావు పల్లి, చెల్పూర్‌, ఇం‌దిరా నగర్‌, ‌రాజపల్లి, సిరసపల్లితో పాటు శాలపల్లికి సంబంధించిన ఓట్లను కూడా లెక్కించారు. అయితే దళితబంధు ప్రకటించిన శాలపల్లిలోనే టీఆర్‌ఎస్‌కు తక్కువ వోట్లు రావడంతో దళితబంధు లబ్దిదారులు షాకిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌ ‌వేసిన పాచిక పారలేదని అంటున్నారు.

Leave a Reply