Take a fresh look at your lifestyle.

‌ప్రజల సహకారం అభినందనీయం : సీతక్క

కరోనా వైరస్‌ ‌ములుగు జిల్లా ప్రాంతంలో రాకుండా అరికట్టడంలో అధికారులకు సహకరిస్తున్న జిల్లా ప్రజల సహకారం అభినందనీయమని ములుగు ఎమ్మేల్యే సీతక్క అన్నారు. గురువారం కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం గ్రామంలోని నిరుపేదలకు ఒక్కోక్కరికి 5 కేజీల బియ్యం,కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం నిరంతరంగా ఇంటి పట్టునే ఉంటు జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుం డా ములుగు జిల్లా ప్రజలు ముందున్నారని అన్నారు.

ఇదే స్పూర్తితో మరిన్ని రోజులు ఉండి కరోనా మహమ్మారీని తరిమి కోట్టుదామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్‌ ‌పార్టీ ములుగు జిల్లా అద్యక్షులు నల్లేల కుమారస్వామి, మండల జడ్పీటిసి కరంచంద్‌,ఎం‌పిపి జనగం సమ్మక్క, వైస్‌ ఎం‌పిపి బోల్లే భాస్కర్‌, ‌మండల కో అప్షన్‌ ‌సభ్యులు ఎండి ఆప్షన్‌ ‌పాషా, మండల ఇంచార్జీ ఇరుసవడ్ల వెంకన్న, ములుగు మండల ఆద్యక్షులు చాంద్‌ ‌పాషా, ఎంపిటిసి మాపురపు తిరుపతిరెడ్డి, యూత్‌ ‌మండల అద్యక్షులు బానోత్‌ ‌రవిచందర్‌, ‌గ్రామ సర్పంచ్‌ ‌సూర్యనారాయణ, రాజు, రమణాకర్‌లు పాల్గోన్నారు.

Leave a Reply