Take a fresh look at your lifestyle.

సమస్యల వలయంలో ప్రభుత్వ పాఠశాలలు…

  • అపరిశుభ్ర పరిసరాలు…
  • పట్టించుకోని అధికారులు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అనేక రకాల పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోంది.అందులో భాగంగా విద్యార్థులు నాణ్యమైన చదువుతో పాటు శారీరకంగా ధృఢంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించి అందజేస్తోంది.అయితే నాణ్యమైన విద్యను ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బుద్దులు నేర్పుతూ అందుకు కావలసిన సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది.అయితే ఇదంతా ఒక పక్క అయితే విద్యార్థులు చదువును నేర్చుకునే పాఠశాలలు మాత్రం అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి. పరిగి నియోజక వర్గం దోమ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ ‌నగర్‌ ‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు సమస్యలను విన్నవించినా అరకొర పనులతో సరిపెడుతున్నారు తప్ప పూర్తి సమస్యల పరిష్కారం మాత్రం జరగడం లేదంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

.అపరిశుభ్ర పరిసరాలు…
పాఠశాల ఆవరణలో గ్రామానికి నీటి సరఫరా నిమిత్తం ఏర్పాటు చేసిన ట్యాంక్‌ ‌వల్ల అక్కడ ఎప్పుడు నీరు నిల్వ ఉండడం తో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.

పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా నీటి సంపు…
నీటి సరఫరా విషయంలో భాగంగా ఏర్పాటు చేసిన నీటి సంపు వల్ల చాలా ఇబ్బందులు. ఆ సంపుకు రంధ్రాలు ఉండడం వల్ల విద్యార్థులకు ఎపుడు ఏం జరుగుతుందో అని భయంతో విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం….. ప్రధానోపాధ్యాయుడు రమేష్‌.
‌పాఠశాలలోని సమస్యల గురించి ఓ వైపు అధికారులకు,పంచాయతీ వారికి పలుమార్లు విన్నవించాము.చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ క్షణం ఏం జరుగునో అని భయంగా ఉంటుంది. సమస్యను త్వరగా పరిష్కరిస్తే బాగుంటుంది.

Leave a Reply