Take a fresh look at your lifestyle.

కొరోనా నివారణలో ప్రజాప్రతినిధులదే కీలక పాత్ర

జన్నారం, మే 14, (ప్రజాతంత్ర విలేఖరి ): కరోనా నివారణలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాల ని రామగుండం కమీషనర్‌ ‌సత్యనారాయణ అన్నారు. గురువారం రోజన మండల కేంద్రంలోని పైడిపెల్లి గార్డెన్‌లో రామగుండం కమిషసరేట్‌ ‌పోలీస్‌ ఆధ్వర్యం లో జెడ్పీటిసి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధు లకు కోవిడ్‌-19 ‌కరోనా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండం కమీషనర్‌ ‌సత్యనారాయణ కరో నా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాల పై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నుండి దాదాపు 3500 మంది వలస కూలీలు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని, లాక్‌డౌన్‌ ‌సడలింపులో వారు గత వారం రోజుల నుండి తిరిగి స్వస్థలాలకు చేరుకుంటు న్నారని, అందులో భాగంగా మంచిర్యాల జిల్లాకు వచ్చి న వారిలో జన్నారం మండలానికి అత్యధికంగా ఇప్పటి వరకు దాదాపు 300 మంది వచ్చారని తెలిపారు. వారికి క్వారంటైన్‌ ‌ముద్ర వేసి హోమ్‌ ‌క్వారంటైన్‌ ‌చేయడం జరిగిందని తెలిపారు. అలా క్వారంటైన్‌ ‌ముద్ర వేసిన వారు బయట తిరగకుండా జెడ్పీటిసి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు తగు జాగ్ర త్తలు తీసుకోవాలని తెలిపారు. హోమ్‌ ‌క్వారంటైన్‌ ‌చేసిన వారు కుటుంబసభ్యులతో సంబంధం లేకుండా ప్రత్యేక గదిలో ఉండాలని అన్నారు. ఒకవేళ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నట్లయితే ఆ కుటుంబ సభ్యులను కూడా బయటికి రాకుండా చూసే బాధ్యత ప్రజాప్రతిని ధులదేనని అన్నారు.

అజాగ్రత్త వద్దు-ఆరోగ్య రక్షణే ముద్దు : రామగుండం సిపి సత్యనారాయణ

ఒకవేళ మీరు చేప్పిన వినకుండా వారు బయట తిరిగినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని, వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎందుకంటే ఒకవేళ వారికి పాజిటివ్‌ ఉన్నట్లయితే గ్రామం మొత్తాని కి కరోనా సోకుతుందని, అలాంటి పరిస్తితులు రాకుం డా ఉండాలంటే ప్రజాప్రతినిథులు, అధికారులు కలిసి సమన్వయంతో పని చేసి కరోనా నివారణకు కృషి చేయాలన్నారు. బయటికి వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, అత్యవసర మైతే తప్పబయటికి రావద్దని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వాలు, పోలీసులు, వైద్య సిబ్బంది, పాయిష్యుద్ద సిబ్బంది ఇప్పటి వరకు పనిచేసాయని, ఇకముందు ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. కరోనా వైరస్‌కి కుల, మత, జాతి, ప్రాంత బేధాలు లేవని, ఆ వ్యాధి ఎవరికైనా సోకవచ్చ ని కావున ఇంటి వద్దనే ఉండి ప్రాణాలను కాపాడుకో వాలని, అజాగ్రత్త వద్దు-ఆరోగ్య రక్షనే ముద్దు అని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. మంచి ర్యాల జిల్లా డిసిపి ఉదయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, జిల్లా ఇంచార్జీ ఎసిపి నరేందర్‌, ‌లక్షేట్టిపేట సిఐ నారాయణ్‌ ‌నాయక్‌, ‌జన్నారం, దండే పల్లి ఎస్సైలు వినోద్‌ ‌కుమార్‌, శ్రీ‌కాం త్‌, ‌జెడ్పీటిసి ఎర్రచంద్రశేఖర్‌, ఎం‌పిపి, వైస్‌ ఎం‌పిపిలు మాదాడి సరోజన, సుతారి వినయ్‌, ‌వివిధ గ్రామాల సర్పంచ్‌ ‌లు, ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!