“ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన భూమి సంగతి చూద్దాం. ముందుగా డిఫెన్స్ భూములు లెక్కేస్తే, భారత రక్షణ మంత్రాలయం అధీనంలో 17.95 లక్షల ఎకరాల భూమి ఉండగా, ఇందులో 1.6 లక్షల ఎకరాలు 62 కంటోన్మెంట్లలో ఉన్నాయి. మిగిలిన 16.53 లక్షల ఎకరాలు ఈ 62 కంటోన్మెంట్ల చుట్టూ విస్తరించి ఊంది. మన మోడీ గారి సర్కార్ ముందు దీనిపై కన్నేసింది. తర్వాత గరిష్ఠంగా భారతీయ రైల్వేలకు చెందిన భూమి. రైల్వే భూమి 11 లక్షల 80 వేల ఎకరాలు కాగా ఆపరేషనల్ భూభాగం తీసేస్తే సుమారు 1 లక్ష 51 ఎకరాలు మిగులు భూమి ఉంటుంది. దీన్ని సర్కారు అమ్మకానికి పెట్టింది. తరువాతి క్రమంలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ పేరిట 24, 980 కోట్ల విలువ అస్తులున్నాయి. ఇదికూడా రెడీ ఫర్ సేల్. మనం దీపావళి సందర్భంగా ధ•న్ తెరాస్ రోజు కొనుక్కోవచ్చు.”
దొరకదు త్వరం గొనుడు సుజనులారా..
ఇదేదో శ్రీ కృష్ణ తులాభారంలో పాటనుకుంటే తప్పులో కాలేసినట్లే..ప్రైవేటు వేలంపాట కూడా కాదు. సాక్షాత్తు మనం వోట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వమే మనలను నడిరోడ్డుపై నిలబెట్టి మనకే అమ్మేయడమన్నమాట. కొరోనా, లాక్ డౌన్లో పోయిన ఉద్యోగాలు ఊడిపోగా, వున్న ఉద్యోగాలలో జీతం కోతలతో నడ్డి విరిగిన పరిస్థితిలో కూడా మనం దీపావళి పండగ సంబురం చేసుకుందామనే ఉత్సాహంలో ఉన్నాం. మార్కెట్లో అరకొరా డిస్కౌంట్ అమ్మకాలున్నా..వాటిని తలదన్నే రీతిలో, మనదగ్గర ఆమాత్రం కూడా డబ్బు ఉంచకుండా గుంజుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఘనంగా ఎన్నుకున్న ప్రభుత్వం గ్రాండ్ సేల్స్ ప్రకటించింది. ప్రజల ఆస్తుల్లో మనం వేటిని చేజిక్కించుకోవచ్చో చూద్దామా..
ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన భూమి సంగతి చూద్దాం. ముందుగా డిఫెన్స్ భూములు లెక్కేస్తే, భారత రక్షణ మంత్రాలయం అధీనంలో 17.95 లక్షల ఎకరాల భూమి ఉండగా, ఇందులో 1.6 లక్షల ఎకరాలు 62 కంటోన్మెంట్లలో ఉన్నాయి. మిగిలిన 16.53 లక్షల ఎకరాలు ఈ 62 కంటోన్మెంట్ల చుట్టూ విస్తరించి ఊంది. మన మోడీ గారి సర్కార్ ముందు దీనిపై కన్నేసింది.
తర్వాత గరిష్ఠంగా భారతీయ రైల్వేలకు చెందిన భూమి. రైల్వే భూమి 11 లక్షల 80 వేల ఎకరాలు కాగా ఆపరేషనల్ భూభాగం తీసేస్తే సుమారు 1 లక్ష 51 ఎకరాలు మిగులు భూమి ఉంటుంది. దీన్ని సర్కారు అమ్మకానికి పెట్టింది. తరువాతి క్రమంలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ పేరిట 24, 980 కోట్ల విలువ అస్తులున్నాయి. ఇదికూడా రెడీ ఫర్ సేల్. మనం దీపావళి సందర్భంగా ధ•న్ తెరాస్ రోజు కొనుక్కోవచ్చు.
ఇంతే కాదండోయ్. ఇంకేమున్నాయో చూడాలంటే డిపార్ట్మెంట్ అఫ్ ఇన్వెస్ట్మెంట్ – పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వెబ్ సైట్‌పై కన్నెయాలి. అక్కడ మీకు ఫర్ సేల్ అని రాసి వున్న ఈ కంపెనీలు కనిపిస్తాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి ఉన్న ఆస్తుల విలువ రు. 1,50,863 కోట్లు. దీని ఈక్విటీ 36,532 కోట్లు. ఈ కంపెనీ ఇచ్చే ఆదాయం 2,84,863 కోట్ల రూపాయలు. 1976లో ఇందిరా గాంధీ ప్రయివేటు వారి చేతుల నుంచి ఈ సంస్థను హస్తగతం చేసుకుని ప్రభుత్వ పరం చేశారు. ఈ కంపెనీలో ప్రస్తుత ప్రభుత్వ వాటా 52.98 శాతం. దీన్ని మోదీగారి ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. మంచి లాభాలు ఇచ్చే కంపెనీగా ఫోర్బస్ జాబితాలో ఉన్న ఈ కంపెనీని సొంతం చేసుకోవాలంటే నవంబర్ 16 లోపల మీరు 39,460 కోట్ల రూపాయలు మాత్రం సిద్ధం చేసుకోవాలి.
ఇక రైల్వే శాఖకు చెందిన కంటైనర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, ప్రభుత్వ పరిశ్రమలో వాటాదారు కావాలంటే నవంబర్ 16 నాటికి 7,000 కోట్లు సిద్ధం చేసుకుంటే 30% కి అధిపతి కావచ్చు. ఈ కంపెనీ మొత్తం ఆస్తులు 11,566 కోట్ల రూపాయలు. ఈక్విటీ 10 వేల కోట్ల రూపాయలు. ఆదాయం 4,473 వేల కోట్ల రూపాయలు. 1988 ఏర్పాటైన ప్రభుత్వ సంస్థ ఇప్పుడు అమ్మకానికి వుంది. 1961లో ఏర్పాటైన షిప్పింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియాను దక్కించుకోవాలంటే 13,722 కోట్లు రెడీ చేసుకోవచ్చు. దీని ద్వారా 4,425 కోట్ల వార్షిక ఆదాయం లభిస్తుంది. ఈక్విటీ 7,298 కోట్లు. ప్రభుత్వ వాటా 63% శాతం కాగా ఇందులో కొంత మోడీ సర్కార్ అమ్మకానికి పెట్టింది. 1964లో నెలకొల్పిన భారత్ ఎర్త్ మొవర్స్ లిమిటెడ్‌లో 28% వాటా కూడా అమ్మకానికి రెడీగా ఉంచింది. ఈ ఆస్తుల విలువ 5,066 కోట్లు. దీనిద్వారా 3,077 కోట్ల రెవెన్యూ గారంటీ కాగా, ఈక్విటీ 2,257 కోట్ల రూపాయలు.
చివరగా భలే చవక బేరం..
తలపాగా పెట్టుకుని వంగి ఆహ్వానం పలికే మహరాజు గుర్తైన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. పాపం దీన్ని నడపటానికి నెల నెలా
అవసరమైన 500 కోట్లు పెద్ద సారువారి సర్కారుకు లేక గంపగూత్తా మీరు 20వేలకోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. అంది వొచ్చే అరుదైన అవకాశం చూసారుగా. భారత ప్రభుత్వం ఎన్నో పెద్ద పెద్ద ప్రభుత్వ పరిశ్రమలను వంద రూపాయలు విలువ చేసేవి పావలాకి కొనుక్కుని సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. వేలంలో మీరు ముకేశ్ అంబానీతో పోటీ పడగలిగితే ఇవన్నీ మీ సొంతం, కాదంటే ఆయన కొనుక్కుంటే తరువాత మోదీగారిపై నెపం వేయద్దు. ఆలసిస్తే ఆశాభంగం. మంచి తరుణం మించిపోతుంది. ఇక అర్జంటుగా గోచీ బిగించి గోదాలోకి దిగండి.