Take a fresh look at your lifestyle.

ప్రజా కవి,కమ్యునిష్టు నాయకుడు,తెలంగాణా సాయుధ పోరాట యోధుడు… సుద్దాల హనుమంతు

సుద్దాల హనుమంతు పేరు లోనె  ఒక ఆవేశం, కవితలో ఒక అర్ధం,వభావాలలో సామాజిక  స్పృహ వుంటాయి. 1910 జూన్‌ ‌నెలలొ జన్మించి, ప్రజాకవిగా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా ఎదిగి, జీవితాన్ని కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన ఘనుడు. తెలంగాణ జాతి యావత్తుని కవితలతో మేల్కొలిపిన మహాకవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం,  అర్థంలో ఆలోచన ఉంటుంది. వీరు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగులోని పేద పద్మశాలి బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. అసలు ఇంటి పేరు గుర్రం. కానీ, ఆయన గుండాల మండలం, సుద్దాల గ్రామంలో నివసించడంతో ఆఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు తెలంగాణ కే పరిమితం కాక, యావదాంధ్ర దేశానికి విస్తరించింది.. పాట ద్వారా ప్రజల్లో  ప్రజాకవిగా నిలబడ్డారు. నిజాం వ్యతిరేకోద్యమంలో జీవితాంతం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే జీవితం అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి. హన్మంతు తండ్రి ఒక ఆయుర్వేద వైద్యుడు.  చిన్ననాటి నుంచే హరికథలు, పాటలు, నాటకాలంటే హనుమంతుకు ఇష్టం. హరికథలు చెప్పే అంజనదాసుకు శిష్యుడై, ఆ బృందంలో చేరాడు.

హన్మంతు ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాదు చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండరుగా పనిచేశాడు. ఆర్యసమాజం వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేశాడు. పెద్ద చదువులేదు. లేదు- ఆరోజుల్లో  అందుకు అవకాశాల్లేవు. వీధిబడిలో ఉర్దూ, తెలుగు భాషలునేర్చుకున్నాడు. శత కాలు, కీర్తనలు,  సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో యక్షగానాలు, కీర్తనలు,  భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి వుండేది. గొంతెత్తి పాడటం, చిన్నతనం నుండే నాటకాల పై ఆసక్తిని పెంచుకున్నాడు. ఆయన హరికథ, బురక్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచారాసాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఆయన బురక్రథ దలహీనుని కూడా యుద్ధానికి సిద్ధం చేసేదని బలమైన  ప్రచారం. హైదరాబాద్‌ ‌సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారు. విచిత్ర వేషాలు, ‘గొల్లసుద్దులు’, ‘లత్కోరుసాబ్‌’, ‘‌బుడబుక్కలు’, ‘ఫకీరు వేషం’, ‘సాధువు’ మొదలైన కళా రూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించాడు.కమ్యూనిస్టు పార్టీ దళ సభ్యునిగా చేరి పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు హన్మంతు వలంటీర్‌ ‌పనిచేశారు. ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో %–%సంఘం’ స్థాపించారు. సంఘం పెట్టి, పాటలు కట్టి ప్రజల్ని ఉద్రేకపరుస్తున్నాడని హనుమంతు పై నిజాం ప్రభుత్వం అరెస్టు వారెంట్‌ ‌జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసం లోకి వెళ్ళారు. వెట్టిచాకిరీని, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ రాసిన  పాటలు ‘వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయి. భూమి కోసం, భుక్తి కోసం, బానిస జన విముక్తి కోసం జరిగిన ఈ పోరాటం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. చారిత్రాత్మిక సాయుధ పోరాటంలో తెలంగాణకు చెందిన 5  వేల మంది  ప్రాణ త్యాగాలు చేస్తే అందులో సగం మంది నల్లగొండ జిల్లా వారేనంటే ఆ జిల్లా పాత్ర ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
రాజపేట మండలం రేణుకుంటలో కమ్యూనిస్టుల గ్రామసభలో మాభూమి నాటకం, గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తుండగా  సుద్దాలతో పాటు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కురారం రాంరెడ్డి, రేణుకుంట రాంరెడ్డి, ఎలుకపల్లి యాదగిరిలు అక్కడ ఉన్నారు. సభను చెదరగొట్టేందుకు నిజాం మూకలు వస్తున్న సమాచారం అందడంతో జనృ  పారిపో తుండగా,   ఓ ముసలామె చేతిలో కర్రను సుద్దాల హన్మంతు లాక్కొని,  ‘వెయ్‌.. ‌దెబ్బ దెబ్బకు దెబ్బ…’ అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. దీంతో అంతా కలిసి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకూ తరిమికొట్టారు. ఒక చేత్తో పెన్నూ, మరో చేత్తో గన్నూ పట్టుకొని పోరాటంలో పాల్గొన్న వీరసేనాని హనుమంతు. జానపద కళారూపాలకు జీవం పోసిన సుద్దాల హనుమంతు క్యాన్సర్‌ ‌వ్యాధితో 1982, అక్టోబర్‌ 10 ? ‌న మరణించాడు. హనుమంతు పాటల్లో యతి ప్రాసలు బలంగా  పడేవి. హనుమంతు రాసిన 22 పాటల పుస్తకం సాహితీ సంస్థ   ప్రచురించింది. హనుమంతు లాంటి కవి,రచయిత తెలంగాణా గడ్డ లో జన్మిచడం పూర్వ జన్మ సుకృతంగా భావించ వచ్చు. ఆ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శం కావాలి.  ఈ రోజు ఆయన్ను స్మరించుకుందాం. నివాళు లర్పిద్దాం.. వీరి కుమారుడు ప్రముఖ పాటల రచయిత,గాయకుడు అశోక్‌ ‌తేజ.

Leave a Reply