నాలాలను క్రమబద్ధీకరించాలి-పాజెక్టుల నుండి నష్టంపరిహారం పొందిన రైతుల పేర్లను రైతుబంధు నుంచి తొలగించాలి : కలెక్టర్ శ్రీధర్
నాగర్ కర్నూల్, మే 22(ప్రజాతంత్ర విలేకరి): జిల్లాలోని ఇరిగేషన్, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి కాలువల కింద రైతులు అందించిన భూముల వివరాలను గుర్తించి, ఆ భూముల సర్వే నెంబర్ల వివరాలను ఆన్లైన్ నమోదు పూర్తిచేయాలని రెవిన్యూ అధికారులను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి, డిఆర్వో మధుసూదన్ నాయక్ ల తో కలిసి ఆర్డీవో లతో కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి భూమిని సేకరించి ప్రాజెక్టుకు అంద జేసిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డు ల లో ప్రాజెక్టులకు బదలాయింపులు జరిగా యా లేదా వాటి హక్కులు ఎవరిపై ఉన్నా యో పునః పరిశీలించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ప్రాజెక్టులనుండి నష్టపరిహారం కింద లబ్ధి చేకూర్చిన రైతుల పేర్లను రైతుబంధు పథకం నుండి సర్వే నెంబర్లను తొలగించాలని కలెక్టర్ ఆర్డీవోలకు ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారు లు సమన్వయంతో భూ సేకరణ చేసి,హద్దు లు వేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అట్టి పూర్తి వివరాలను ఆన్లైన్ నమోదు చేయాలని ఆదేశించారు.
సేకరించిన భూముల వివరాలను, గ్రామాల్లో పాఠశాలల, ఆస్పత్రుల, పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములను గుర్తించాలి, అవి ఏ సర్వేనెంబర్ లో ఉన్నాయో వివరాలను సేకరించి, ఆన్లైన్ చేయాలన్నారు.అదే విధంగా నాలాల క్రమబద్ధీకరణ లో గ్రామాల్లో వ్యవసాయ పొలాలలో పౌల్ట్రీ ఫారంలు, సినిమా హాలు, ఫంక్షన్ హాల్ లు, రైస్ మిల్లులు కాటన్ మిల్లు గుర్తించి వాటి సర్వే నెంబర్లు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో దాతలు ప్రభుత్వాని కి అందజేసిన భూ వివరాలను స్వీకరించి ఆన్లైన్ నందు పొందుపరచాలన్నారు. ప్రాజెక్టుల వినియోగానికి ప్రభుత్వానికి సమర్పించి భూమికి నష్ట పరిహారం పొందిన రైతుల భూములు, వివరాలను రైతుబంధు పథకం నుండి అట్టి రైతుల సర్వే నెంబర్లను ఈ నెల 23వ తేదీ వరకు తొలగించాలని కలెక్టర్ ఆర్డీవోలను ఆదేశించారు. ఈ సమా వేశంలో నాలుగు డివిజన్ల ఆర్డీవోలు నాగలక్ష్మి, శ్రీ రాములు, రాజేష్ కుమార్, పాండు నాయక్ పాల్గొన్నారు.