Take a fresh look at your lifestyle.

‌ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకరావాలి

Public issues, prajatantra callender, minister satyavathi rathod
‘‌ప్రజాతంత్ర’ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌ ‌టౌన్‌: ‌ప్రజాతంత్ర దినపత్రిక ప్రజాసమస్యలను మరింత వెలుగులోకి తీసుకురావాలని క్షేత్ర స్థాయిలో మీడియా శరవేగంగా దూసుకుపోతుందని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో మంత్రి నివాసంలో ప్రజాతంత్ర దినపత్రిక క్యాలెండర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడుతూ ఉద్యమ సమయంలో మీడియా పాత్ర మరువలేనిదన్నారు.

ఉద్యమ సమయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన మొదటి దినపత్రిక అని గుర్తు చేశారు. ప్రజాతంత్ర మరింత ఉన్నతంగా క్షేత్ర స్థాయిలో పని చేయాలని ఆకాక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు బండి వెంకట్‌ ‌రెడ్డి, గార్లపాటి వెంకట్‌ ‌రెడ్డి, రంజీ నాయక్‌ ‌తెలంగాణ లిబర్టీ ప్రాంతీయ పత్రిక ఎడిటర్‌ ‌దేశబోయిన ఉపేందర్‌, ‌గుండపునేని యాదగిరి రావు, మాదాసు రాము తదితరులు పాల్గొన్నారు.

Tags: Public issues, prajatantra callender, minister satyavathi rathod

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!