Take a fresh look at your lifestyle.

బిజెపి కార్యవర్గంలో చర్చకు రాని ప్రజా సమస్యలు..

బిజెపి మరోమారు ఎన్నికల శంఖారావం పూరించింది. 9 రాష్టాల్ల్రో విజయమే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేసుకున్నారు. ఈ ఏడాది తెలంగాణ సహా  తొమ్మది రాష్టాల్ర ఎన్నికలపై దృష్టి సారించింది. అందుకోసం బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. బిజెపి కార్యవర్గ సమావేశంలో ఈ రెండే అంశాలపైనే  ప్రధానంగా చర్చ సాగాయని చెప్పాలి. ఎన్నికల్లో గెలవడం..బిజెపి అధ్యక్షుడిగా నడ్డాను కొనసాగించడం.. బిజెపికి సంబంధించినంత వరకు ఈ రెండు అంశాలు ప్రధానమైనవి. అయితే ఇవి ప్రజలకు సంబంధం లేనివే. నిజానికి ఎన్నికలకు వెళ్లేముందు దేశంతో పాటు ఆయా రాష్టాల్ల్రో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీసంగా అయినా చర్చించలేదు. అలాగే ఎవరు కూడా ప్రస్తావించలేదు. నిజానికి బిజెపి అధికారం చేపట్టాక ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో కూడా ఎలాంటి హాలు దక్కడం లేదు. మధ్యతరగతి బాధలు తనకు తెలుసన్న నిర్మలా సీతారామన్‌ ‌మాటలు కూడా నమ్మశక్యంగా లేవు. దేశంలో ప్రజలు నిరుద్యోగం, జిఎస్టీ, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరుకుం టున్నారు.

ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతున్నా ప్రజలకు వివరణ ఇచ్చుకోవడంలేదు. వాటిని ఎక్కడా ప్రస్తావించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో పావులు కదుపడం తప్ప ప్రజలకు ఏం చేశామన్న చర్చకు బిజెపి నేతలు ముందుకు రావడం లేదు. ఇదే సందర్భంలో ఫిబ్రవరి 1న బడ్జెట్‌కు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో 9 రాష్టాల్లో్ర ఒక్క చోట కూడా ఓడిపోకూడదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్‌ ‌కొట్టేందుకు ఈ రాష్టాల్ర ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకమని భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలు రచించేందుకు రెండ్రోజులు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇదే ఎజెండాతో ముగిసాయి. అయితే అధికారం చేపట్టడం అన్నది ప్రజల సమస్యలు పరిష్కరించడానికే అన్న ధ్యాసలేకుండా పాలన సాగిస్తున్నారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం తర్వాత హిమాచల్‌ ‌కూడా ఓడిపోయామని భావించడం లేదు. అక్కడ ఎందుకు ఓడిపోయామో అన్న చర్చకు తావీయడం లేదు. స్వల్పతేడాతో విజయాన్ని చేజార్చుకున్నామని మాత్రమే సమర్థించుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి 2024 ఎన్నికల ముంగిట పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్టు నడ్డా తెలియజేశారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారతదేశం పురోగతి సాధించిందని ప్రశంసించారు. ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా.. మొబైల్‌ ‌ఫోన్ల ఉత్పాదనలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా,ఆటోరంగంలో మూడో అతిపెద్ద మాన్యుఫ్యాక్చ రర్‌గా దేశం అవతరించిందని నడ్డా చంకలు •గుద్దుకున్నారు. రోజుకు 37 కిలోటర్ల మేర జాతీయ రహదా రుల నిర్మాణం జరుగుతోందని,గతంలో ఇది 12 కిలోటర్లు మాత్రమేనని కూడా ప్రకటించుకున్నారు. ఉచిత రేషన్‌ ‌సహా పలు సంక్షేమ పథకాలతో పేదలకు సాధికారత అందిస్తున్నామని, గుజరాత్‌ ఎన్నికల్లో అసాధారణ, చరిత్రాత్మక విజయం సాధించామని విజయోత్సాహాన్ని ప్రకటించుకున్నారు. 182 అసెంబ్లీ స్థానాల్లో 156 గెలవడం గొప్ప విజయం. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్‌, ‌బీజేపీ మధ్య ఓట్ల తేడా ఒక శాతం కంటే తక్కువేనని నడ్డా సమర్థించుకున్నారు. తెలంగాణ, ఇతర రాష్టాల్ల్రో గెలవడం కోసం అవలంబించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. 9 రాష్టాల్ల్రో 72వేల బూత్‌ల్లో పార్టీ బలహీనంగా ఉన్నదని, కష్టపడి పనిచేస్తే అన్నిరాష్టాల్ల్రో విజయం ఖాయమని నడ్డా అన్నారు. 2023 బీజేపీకి అత్యంత ముఖ్యమైన సంవత్సరమని కూడా అన్నారు.

నిజానికి ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదు. బిజెపి అధికారంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించారు. కానీ అద్భుతాలు కాదుకదా ప్రజల బతుకులు దుర్భరంగా మారాయి. ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో బూత్‌ ‌స్థాయిలో గుర్తించి చర్చ చేయడం లేదు. తెలంగాణనే తీసుకుంటే ఇక్కడి నేతలు కనీసం ఒక్క సమస్యను కూడా ప్రస్తావించలేక పోయారు. కిషన్‌ ‌రెడ్డి కావచ్చు..బండి సంజయ్‌ ‌కావచ్చు ఒక్కటంటే ఒక్క సమస్యను కూడా ప్రస్తావించ లేదు. ఎపి నుంచి అసలు సమస్యల ప్రస్తావనే లేదు. ఇవేవీ లేకుడానే ఎన్నికల్లో గెలవడం అత్యాశే తప్ప మరోటికాదు. బీజేపీ జాతీయ కార్యవవర్గ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ దిల్లీలో భారీ రోడ్‌ ‌షో నిర్వహించారు. ఏమి విజయం సాధించామని రోడ్‌షో నిర్వహించారో ఆయనకే తెలియారు. ఎనమిదన్నరేళ్ల పదవీకాలం పూర్తయినా దేశంలో మౌళిక సమస్యలు గుర్తించడం లేదు. ఉత్తర ప్రదేశ్‌లో తాము గెలిచామని, పశ్చిమ బెంగాల్‌లో తమ బలం పెరిగిం దని, గుజరాత్‌లో భారీ విజయాన్ని సాధించా మని  ఆనందించడం తప్ప ..బిజెపితో ప్రజలకు కలిగిన లాభమేమిటో చెప్పడం లేదు.

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా అన్నది చెప్పాలి. మోదీ• రాక ముందుకు వచ్చిన తరవాత ధరల సూచీని చర్చించాలి. నిరుద్యోగంపై చర్చించాలి. కానీ అలా జరగడం లేదు. సోమవారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ కీలక సమావేశంలో మోదీ, అమిత్‌ ‌షా లతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్టాల్ర ముఖ్య మంత్రులు పాల్గొన్నారు. ఏ ఒక్కరు కూడా దేశంలోని సమస్యలను ప్రస్తావించలేదు. అంతా మోదీ• భజనలో తన్మయత్వం చెందారు. పాలన బాగుందని చప్పట్లు కొట్టారు. ఇదే తరహా పాలన సాగితే మోదీ•కి ప్రధానిగా చేసిన పదేళ్ల అనుభవం వస్తుందే కానీ..ప్రజలు పదేళ్లుగా బాధలు పడుతున్నా పట్టింపులేని ప్రధానిగా చరిత్రలో మిగిలిపోతారు. చాయ్‌ అమ్మిన వ్యక్తి దేశ ప్రధాని అయితే ప్రజల దరిద్రం తీరాలి. కానీ అలా జరగలేదు. జరగదని కూడా తేలిపోయింది. సమస్యలను చర్చించని బిజెపి నేతలకు ప్రజల బాధలు పట్టవని కూడా తేలిపోయింది. ప్రజలు ఏది మంచో..ఏది చెడో ఇక ఆలోచించుకోకుంటే మోసపోతారు.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply