తాండూరు : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డేను పురస్కరించుకొని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను సన్మానించారు. శుక్రవారం తాండూర్లో నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అధ్యక్షతన టీజేఎస్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ సాంబార్ సోమశంకర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, పట్టణ బీసీ సంఘం అధ్యక్షులు రాజన్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకుర్లు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పూలమాలలతో సత్కరించి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కొరోనా మహమ్మారి నిర్మూలనకై శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తాండూర్ ప్రజలు కూడా అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, అశోక్ బస్వరాజ్, సాయి, చరణ్, సయ్యద్ యూసఫ్, తదితరులు పాల్గొన్నారు.