Take a fresh look at your lifestyle.

‌తహశీల్దార్లపై స్థానిక ప్రజాప్రతినిధుల ఆగ్రహం

  • కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన
  • అభివృద్ది పనులకు ఇసుక కొరత
    విద్య వ్యవస్థ తీరుపై సభ్యుల అసహనం
  • మంత్రి,ఎంపీ, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు గైర్హాజర్‌
  • ‌జిల్లా పరిషత్‌ ‌సర్వసభ్య సమావేశం తీరు

జిల్లా పరిషత్‌ ‌సర్వ సభ్య సమావేశంలో స్ధానిక ప్రజా ప్రనిధులు సమస్యలపై ఏకరవు పెట్టారు. గురువారం జిల్లా పరిషత్‌సమావేశ మందిరంలో చైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ ‌సర్వ  సభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, మిషన్‌ ‌భగిరధ, గ్రామీణ త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్యం, జిల్లా విద్యశాఖ కార్యక్ర మాలు, మత్స్య, పశు సంవర్ధకశాఖ, మైనర్‌ ఇరిగేషన్‌ ‌నాగార్జున సాగర్‌ ‌కార్యక్రమాలను అజెండా అంశాలుగా చేర్చారు. అధికారులు మాత్రం తమ వెంట తెచ్చు,కున్న నివేదికలను చదివి వినిపించి మమ అనిపించారు. స్ధానిక ప్రజా ప్రతినిధులు స్ధానికంగా ఉన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకవచ్చారు. కొందరు అధికారులు ఆ సమస్య పరిస్కారం అయిందని, మరి కొందరు నిధులు లేవని ,ప్రభుత్వం అనుమతి కావాలంటూ చెబుతూ కాలం వెళ్ళదీశారు. దీంతో పలు శాఖల అధికారులపై సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  పనులు చేయడానికి నిధులు లేవు.. అధికారులు సహకరించరు…. ప్రజాప్రతిని ధులకు ఎలాంటి గౌరవం లేకుండా పోయిందని సభ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. మండలాలల్లో తహశీల్ధార్లు స్ధానిక ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఎర్రుపాలెం జడ్పీటీసీ శీలం కవిత పేర్కొన్నారు. తహశీల్ధార్‌ ‌కార్యాలయానికి స్వయంగా వెళ్ళిన తనను ఆర్ధగంట పాటు బయట నిల్చోబెట్టారని తరువాత లోపలికి పిలిచారని కనీస మహిళా ప్రజా ప్రతినిధి అని కూడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజా సమస్యల కోసం వెళ్ళిన తనను పట్టించుకోకపోవడం సరికాదన్నారు.దీంతో సభ్యులంతా ఆమెకు మద్దతుగా అన్ని మండలాలల్లో ఇదే పరిస్థితి నెలకొందని అధికారుల తీరు మారాలని నినదించారు.

 

- Advertisement -

జిల్లాలో అభివృద్ది పనులకు ఇసుక కొరత తీవ్రంగా ఉందని పనులు వేగవంతం చెబుతున్నారని ఇసుక లభ్యం కావడంలేదని సభ్యులు జగన్‌, ‌వెంకటప్రవీణ్‌కుమార్‌ ‌నాయక్‌, ‌కట్టా అజయ్‌కుమార్‌లు సభ దృష్టికి తీసుకవచ్చారు. ఇసుక కు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. గుండాలలో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎర్రుపాలెం నుంచి ఇసుక రావడానికి ఏపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని సభ్యులు పేర్కొన్నారు. దీంతో చైర్మన్‌ ‌కలగజేసుకుని మన ఇసుకను ఏపీ వాళ్ళు అడ్డుకోవడం ఏమిటని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల పారిశుద్ద్యం మెరుగుపడిందన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ,స్ధానిక ప్రజాప్రతినిధులు సమన్వయ్యంతో  పని చేయాలని చైర్మన్‌ ‌కమల్‌రాజ్‌ ‌సూచించారు. వైరా జడ్పీటీసీ కనకదుర్గ మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో పలు స్కూల్‌లో వ్యర్ధాలతో అపరిశుభ్రవాతావరణం నెలకొందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే తొలగిం చేలా చర్యలు తీసుకోవాలని ఆమె డీఈవోకు సూచించారు. సింగరేణి మండలం పోలంపల్లిలో స్కూల్‌ ‌బిల్డింగ్‌ ‌లేక విద్యార్ధులు పంచాయతీ భవనంలో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. పంచాయతీ సమావేశాల సమయంలో పిల్లలు ఆరుభయట ఉండా ల్సి వస్తుందని సభ్యులు పేర్కొన్నారు. తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీను మాట్లాడుతూ స్వచ్చ భారత్‌లో స్కూల్స్‌లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని అవి విద్యార్ధులకు సరిపడా లేక పోవడంతో బాలురు ఆరుబయటకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇటివల బిల్లుపాడులో గ్రామస్తులు ఆందోళన చేశారని సరిపడా ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. దీంతో డీఈవోఎ ఏడాదికి రూ.56 కోట్లు అవసరం ఉందని ప్రభుత్వం 10 కోట్లు మామ్రే విడుదల చేసిందన్నారు. అంగ్ల మాధ్యమం ఏర్పాటు చేసినా వాటిని చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో పధకం అమలుకు నోచుకోవడం లేదన్నారు. అడ్డగోలుగా ప్రైవేటు స్కూల్సకు అనుమతులు ఇస్తున్నారని ,ప్రైవేటులో ఇంటర్‌ ‌వాళ్ళు, ప్రభుత్వ స్కూల్స్‌లో బీఈడి వాళ్ళు విద్యనందిస్తున్నా ప్రైవేటుకే మొగ్గుచుపుతున్నారని ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించాలన్నారు.

 

తిరుమలాయపాలెం జడ్పీటీసీ బెల్లం శ్రీను మాట్లాడుతూ బచ్చోడు స్కూల్‌లో ధాన్యం బస్తాలు వేసి పిల్లలను బయట కూర్చొబెట్టారని హెఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. బొనకల్‌ ఎం‌పీపీ మాట్లాడుతూ కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో గుడ్లు అందించడం లేదని పేర్కొన్నారు. ఖమ్మం రూరల్‌ ఎం‌పిపి మాట్లాడుతూ రూరల్‌ ‌కెజిబివిలో సమస్యలు పరిష్కారానికి నిధులు కేటాయించాలని కోరారు. ముదిగొండ ఎంపిపి సామినేని హరిప్రసాద్‌ ‌మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు గడిచినా పాఠశాలలో బెంచిలు లేక విద్యార్థులు కిందకూర్చొవాల్సి వస్తుందన్నారు. విద్యాశాఖ అధికారులు సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తు న్నారని అన్నారు. ముదిగొండలో చైనా ఫ్యాక్టరీ ఉందని ఆ పరిధిలో విద్య, ఆరోగ్య మెరుగుకు నిధులు విడుదల చేస్తుందని ,ఆ నిధులు కలెక్టర్‌కు పంపుతున్నట్లు చెబుతున్నారని వాటిని  స్ధానిక అభివృద్దికి కేటాయించాల న్నారు. మిషన్‌ ‌భగిరధ పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. రభీకి సమస్యలు తలెత్తకుండా  నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్‌ ‌సర్వసభ్య సమావే శానికి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ ‌మినహ ఏఒక్క ఎమ్మెల్యే హజరు కాలేదు. అలాగే మంత్రి, ఎంపీ,ఎమ్మెల్సీలు హజరుకాకపోవడంతో స్ధానిక ప్రజాప్రతినిధులు తీవ్ర నిరుత్సాహనికి గురయ్యారు. ఈకార్యక్రమంలో సీఈవో ప్రియాంకా,డిప్యూటి సీఈవో అప్పారావు తదితరులు హజరయ్యారు.

Leave a Reply