- ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది
- పీఆర్సీపై సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు
- మండలిలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఆశాజన కంగా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం నిరాశాజనకంగా ఉందని విమర్శిస్తు న్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యా నించారు. రాష్ట్ర అప్పులను జీఎస్డీ పీని దృష్టిలో ఉంచుకుని చూడాలని పేర్కొన్నారు. శుక్రవారం శాసనమం డలిలో ఆయన మాట్లాడుతూ 24 రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులు తీసుకున్నాయనీ, కానీ, తెలంగాణ మాత్రం దాని పరిధిలోనే అప్పులను తీసుకుందని చెప్పారు. రాష్ట్రంలో ఆదాయం పెంపుకోసం ప్రత్యేకంగా దృష్టి సారించమని చెప్పారు. అనేక శాఖల నుంచి విద్యా రంగానికి బడ్జెట్ నుంచి 124 శాతం నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 23 వేల మంది కొత్త ఉద్యోగులను నియమించామనీ, కేంద్రం నుంచి కోతలే తప్ప వచ్చిన నిధులు రావడం లేదని స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీఎస్టీ బకాయిలు రూ. 9033 కోట్లు రావాలనీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 450 కోట్ల నిధులను ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి కూడా రూ. 395 కోట్ల నిధులు రావాల్సి ఉందనీ, ఈ విషయంపై కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీపై సీఎం కేసీఆర్ అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. మండల, జిల్లా పరిషత్‌లకు సైతం గ్రామ పంచాయతీల తరహాలో నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. దశలవారీగా పాత జిల్లా కేంద్రాలలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే యూనివర్సిటిలలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుతోందనీ, ఇతర కోర్సులలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనీ, అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు తగ్గాయని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.