వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కి ఉరి

February 6, 2020

Psycho killer ,Srinivas Reddy,crime
హాజీపూర్‌ ‌కేసులో ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు సంచలన తీర్పు

హాజీపూర్‌ ‌వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్‌రెడ్డికి నల్లగొండ ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు మరణదండన విధించింది.  శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ పోక్సోకోర్టు తీర్పు చెప్పింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య కేసుల్లో సంచలన తీర్పునిచ్చింది. బాలికలపై అత్యాచారి చేసి.. చంపి.. బావిలో పూడ్చిపెట్టిన కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేల్చింది. మూడు కేసుల్లో వేర్వేరుగా జడ్జి వీవీ నాథ్‌రెడ్డి తీర్పు వెలువరించారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. 90 రోజుల్లో విచారణ పూర్తి చేశారు. మొత్తం 101 మంది సాక్షులను ప్రత్యేక కోర్టు విచారించింది. అంతకుముందు మూడు కేసుల్లో నేరస్తుడిగా ప్రాసిక్యూషన్‌ ‌నిరూపించిందని, దీనిపై ఏమైనా చెప్పుకుంటావా అని న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డిని అడిగారు. తనకే పాపం తెలియదని, పోలీసులు తనను కొట్టి ఒప్పించారని రోదిస్తూ చెప్పాడు. తన తల్లిదండ్రులు వృద్ధులని, వారిని తానే చూసుకోవాలని, తల్లిదండ్రులు ఎక్కడున్నారో కూడా తెలియదని శ్రీనివాస రెడ్డి న్యాయమూర్తికి చెప్పుకొచ్చాడు. శ్రీనివాసరెడ్డి వాదనలు విన్న కోర్టు.. అతడిని దోషిగా ప్రకటించి.. ఉరి శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పునిచ్చింది

Tags: Psycho killer ,Srinivas Reddy,crime