- సమాచార సంకేతిక రంగంలో మరింత ముందుకు
- నింగిలోకి దూసుకెళ్లిన సీ-50 రాకెట్
సమాచార రంగంలో మరో విప్లవానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 3.41 గంటలకు సమాచార ఉపగ్రహం సీఎంఎస్-01ను మోసుకుంటూ నిప్పులు చెరుగుతూ నింగికెగసింది. కేవలం 20 నిముషాల్లోనే అది తన కక్షలోకి చేరింది. నిజానికి ప్రయోగం పలుమార్లు వాయిదా పడి చివరికి గురువారం చేపట్టారు. ఈ ప్రయోగం ద్వారా దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభించ నున్నాయి. దీని పరిమితి భారత్‌తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌కు విస్తరించనుంది.
ఏడు సంవత్సరాల పాటు సేవలు అందించనున్న ఈ ఉపగ్రహం బరువు 1410 కిలోలు. భారత్ ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 50వది కాగా, పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది. షార్ నుంచి ఇది 77వ మిషన్ అని ఇస్రో పేర్కొంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంత దీనిని తయారు చేశారు. సి-బ్యాండ్ సేవల విస్తరణకు ఈ ప్రయోగం దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. గురువారం నాటి ప్రయోగంతో మరో కీలక ఘట్టానికి షార్ వేదికైంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉపగ్రహాలను భూమికి 800 కిలోవి•టర్ల ఎత్తు నుంచి 504 కిలోవి•టర్లు తగ్గించుకుంటూ వొస్తే 8 రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే వీలుంటుందని గుర్తించింది పీఎస్ఎల్వీ రాకెట్టే కావడం గమనార్హం.