Take a fresh look at your lifestyle.

‌శ్రీ శ్రీ పదంతో నిరూపించుకుంటా…

దినపత్రికలా నన్ను చదువుకుంటా
శీర్షికలను తలుపుకొట్టి
వార్తలను నిద్రలేపి
పేజీ పేజీలోకి వెళ్లి ఒపిగ్గా తెలుసుకుంటా…

Proving with the word Sri Sri ...

Community-verified icon

.

ఉదయానే
చేదునిజాలతో ముఖాన్ని కడుక్కొని
వేడివేడిగా తీపివార్తల్ని తాగుతూ
రోజంతా తాజాగా మసలుకుంటా…

ముద్రించిన చెడును కడేసుకుంటూ
నిద్రించే మంచిని తట్టిలేపుకుంటూ
పొగడబడ్డ చోట భద్రంగా ఒదిగి,
ప్రచురించిన చిత్రాన్ని కత్తిరించి
గుండె గోడకు అంటించుకుంటా…

ప్రశ్న ముళ్ళులా గుచ్చుకున్నపుడల్లా
స్వీయపరీక్షతో పరిశీలించి
జవాబు శోధించి సాధించి
మనసును మరోదారికి మలుచుకుంటా…

ఒక రోజు అనుభవాన్ని
అక్షీకరించిన సంపాదికీయాన్ని
సంపదగా బతుకు ఖాతాలో
జమచేసుకుంటా….

ఏనాటికైనా పత్రికలో ఓ రోజు
శ్రీ శ్రీ పదం లాంటి ఓ పతాక శీర్షికతో
ఓ ఘనమైన వార్తతో
గుభాళించి నన్ను నేను నిరూపించుకుంటా…
– చందలూరి నారాయణరావు
9704437247

Leave a Reply