Take a fresh look at your lifestyle.

సుప్రీం, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా కల్పించండి ..!

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కి బీసీ సంఘాల విజ్ఞప్తి.

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ,జూలై 27: సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి ల నియామకాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్‌ ఆర్‌.‌కృష్ణయ్య డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి భగేల్‌ ‌కలిసి, వినతి పత్రం ఇచ్చారు. అనంరతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ… గడిచిన 74 ఏండ్లలో జడ్జీల నియామకాల్లో బీసీల పర్సెంటేజ్‌ 3 ‌శాతం దాటలేదన్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీల పర్సెంటేజ్‌ 2 ‌శాతాన్ని దాటలేదన్నారు. దేశ జనాభాలో 56 శాతం గల బీసీలకు, 25 శాతం గల ఎస్సీ, ఎస్టీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే… ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని? ప్రశ్నించారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన 46 మంది సుప్రీం కోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌నియామకాల్లో ఒక్క బీసీకి అవకాశం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించడానికి సమర్ధులైన, న్యాయ పరిజ్ఞానం గల, విద్య అర్హతలు గల అడ్వకేట్లు ఉన్నారన్నారు. రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ ‌చైర్మన్‌ ఎం.ఎన్‌ ‌వెంకట చలయ్య ఉన్నత న్యాయస్థానాల జడ్జీల నియామకాలలో బీసీ , ఎస్సీ, ఎస్టీలకు కోటా కల్పించాలని సిఫార్సు చేశారని చెప్పారు. అలాగే, కేంద్రం నియమించిన ఈఎం సుదర్శన్‌ ‌నాచియప్పన్‌ ‌పార్లమెంటరీ కమిటీ జడ్జిల నియామకాలలో ఈ వర్గాల ప్రాతినిధ్యం పెంచాలని సూచించిందన్నారు. తమ విజ్‌ఒప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఆర్‌.‌కృష్ణయ్య మీడియాకు వెల్లడించారు.

బీసీల డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకు వెళతా: కిషన్‌ ‌రెడ్డి
పార్లమెంట్‌ ‌లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి, చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల నేతలు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిని కలిసారు. బీసీల అభివఈద్ధికి సహకరించాలని కోరారు. దీనపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి… బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి చర్యలను ప్రారంభించిందని తెలిపారు. కేంద్ర కేబినేట్‌ ‌లో 27 మందిని, ఆరు రాష్ట్రాలకు గవర్నర్లుగా బీసీలను నియమించిందని వివరించారు. అలాగే, జాతీయ బీసీ కమిషన్‌ ‌కు రాజ్యాంగ బద్దమైన హామి కల్పించిన విషయాన్ని కిషన్‌ ‌రెడి బీసీ నేతలకు గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్లను ఏ,బి, సి, డి వర్గీకరణకు కమిషన్‌ ‌కు నియమించిందన్నారు.

Leave a Reply