Take a fresh look at your lifestyle.

నాణ్యమైన విద్యను అందించాలి

Provide quality education satyavathi rathod
పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
మాట వినని ఉద్యోగులు ఇంటికే
గిరిజన శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రతిభ ఉన్న గిరిజన విద్యార్థులు కోసం నాణ్యమైన విద్య అందిం చేందుకు ఏకలవ్య గురుకుల పాఠశాలలను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించి లక్ష రూపాయల జీతాలు ఇచ్చి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే మిమ్మలను మార్చాల్సి వస్తుందని ఆమె ప్రిన్సిపాల్‌ ‌ను ఇంచార్జి ప్రిన్సిపాల్‌ ‌ను హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాల ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శ్రీ శిశు సంక్షేమ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లక్షల జీతం తీసుకునే ఉద్యోగులు ప్రభుత్వం మాట వినకుండా నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు

వసతుల గురించి ఆరా తీసిన మంత్రి
విద్యార్థులతో కలిసి బాక్సింగ్‌ ‌చేసారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రత పై ఆమె ఉపాధ్యాయుల పై అసంతృప్తి వెళ్లబుచ్చారు. రాష్ట్ర గిరిజన విద్యార్థుల సంక్షేమం లక్ష్యంగా, సిఎం కేసిఆర్‌ ‌మానసపుత్రికలైన గురుకులాల నిర్వహణ ఆయన ఆలోచన మేరకు గొప్పగా నడవాలన్న సంకల్పంతో ప్రతి ఒక్క ఉద్యోగి పాటుపడాలని ఆమె అన్నారు.అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, గురుకులంలోని మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇచ్చిన నినాదం మేరకు పాఠశాలలోని ఆవరణను పచ్చదనంతో ఉంచాలని సూచించారు. సరైన రీతిలో పరిశుభ్రత లేదని గుర్తించి, రీజినల్‌ ‌కో ఆర్డినేటర్‌ ‌కు ఫోన్‌ ‌చేసి మందలించారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే విషయంలోనూ, వారికి అందించే వసతుల విషయం లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేంది లేదని ఆమె వారిని హెచ్చరించారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే మాట వినని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags: Provide quality, education, satyavathi rathod, girijana dept, hostels

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply