Take a fresh look at your lifestyle.

బాధితులకు అత్యవసర వైద్యం అందించాలి

  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్‌
  • ‌ప్రమాదంపై అనుమానాలున్నాయన్న  ఎం పీ రేవంత్‌ ‌రెడ్డి
 శ్రీ‌శైలం జల విద్యుత్‌ ‌కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై విపక్షనేతలు దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆరా తీసారు. ఈ ప్రమాదంలో కొందరు ఉద్యోగులు భూగర్భం లోనే చిక్కుకుపోవడం ఆందోళన కల్గిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.  వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.
revanbth reddy
ఈ ఘటనపై విచారణ జరిపించాలని సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. రాష్ట్ర సాగునీరు, విద్యుత్‌ అవసరాలు తీర్చే శ్రీశైలం జలాశయం లాంటి సున్నితమైన, అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతాల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేయలన్నారు. శ్రీశైలం విద్యుత్‌ ‌కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై కాంగ్రెస్‌ ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. శ్రీశైలం విద్యుత్‌ ‌కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా!? అని ప్రశ్నించారు. జగన్‌ ‌జల దోపిడీకి కేసీఆర్‌ ‌సహకరించి… విద్యుత్‌ ‌ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందే చెప్పామని… జరిగిన పరిణామం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమోనని అనిపిస్తోందని ఆరోపించారు. నిజానిజాలు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply