Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నేటి నుంచి జరగాల్సిన.. ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా

  • హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
  • యూజీ, పీజీ పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వండి

రాష్ట్రంలో కొరోనా విజృంభిస్తున్న వేళ ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు బుధవారం నుంచి జరగాల్సిన ఎంసెట్‌, ‌పాలిసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ‌పీజీ ఈసెట్‌, ‌లాసెట్‌, ఎడ్‌సెట్‌ ‌వంటి ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకూ భారీ సంఖ్యలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్‌ ‌యాదవ్‌ ‌హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ ‌విధించే అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని ఏజీని కోరింది.

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయనీ, ఈ సమయంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరపాలంటే లాక్‌డౌన్‌ అం‌శంపై స్పష్టత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే, లాక్‌డౌన్‌ అం‌శం కేబినెట్‌ ‌నిర్ణయంపై ఆధారపడి ఉన్నదనీ, ఒకటి రెండు రోజుల్లో కేబినెట్‌ ‌భేటీ అయ్యే అవకాశం ఉందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ప్రవేశ పరీక్షల వాయిదాపై సీఎస్‌తో చర్చించి మధ్యాహ్నం నిర్ణయం చెబుతామని తెలిపారు. దీంతో హైకోర్టు విచారణను మధ్యాహ్నం 2 30 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం కోర్టు తిరిగి ప్రారంభం కాగా, రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తిరిగి వెల్లడిస్తామని తెలిపింది. కాగా, ఇంజనీరింగ్‌ ‌చివరి సెమిస్టర్‌తో పాటు యూజీ, పీజీ పరీక్షల నిర్వహణపై జూలై 9లోగా స్పష్టత ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి, జేఏన్టీయూను హైకోర్టు ఆదేశించింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!