Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి

  • జిల్లాలో కోవిడ్‌ ‌పేషెంట్లకు రూ.2 వేలకే సిటీ స్కానింగ్‌
  • ఆక్సిజన్‌, ‌రేమిడిసివర్‌ ‌కు కొరత లేదు
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

జిల్లాలో కోవిడ్‌ ‌బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ దవాఖానల లో అన్ని వసతులతో వైద్యం అందుతుందన్న నమ్మకాన్ని కల్పించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఎంపీలు, ఎం ఎల్‌ ఎలు, ఎం ఎల్‌ ‌సి లు, డి ఎం అండ్‌ ‌హెచ్‌ ఓ, ‌డి సి హెచ్‌ ఎస్‌, ‌కోవిడ్‌ ‌స్పెషల్‌ ఆఫీసర్‌, ‌రెవిన్యూ డివిజనల్‌ అధికారులు, సీటి స్కానింగ్‌ ‌నిర్వాహకులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ‌ద్వారా మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడవద్దని, ప్రభుత్వ దవాఖానలహొ లో మెరుగైన వైద్యం అందించి వారికి భరోసా కల్పించాలన్నారు.జిల్లాలోని పేద ప్రజలకు సహకరించాలని, సీ టి స్కానింగ్‌ ‌రేట్లను తగ్గించాలని కోరగా, కోవిడ్‌ ‌పేషెంట్లకు రెండు వేల రూపాయలకేహొ సిటీ స్కానింగ్‌ ( ‌ఫిల్మ్ ‌లేకుండా) చేయడానికి అంగీకరించిన స్కానింగ్‌ ‌కేంద్రాల నిర్వాహకులను మంత్రి అభినందించారు.

జిల్లాలో గల 13 సిటీ స్కానింగ్‌ ‌కేంద్రాలన్ని అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. కోవిడ్‌ ‌పేషెంట్లకు రూ. రెండు వేలకుహొ సిటీ స్కాన్‌ ‌చేయబడునని ఆయా కేంద్రాల్లో ఫ్లెక్సీ పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. అన్నిచోట్ల ప్రజలకు తెలిసేలా బ్యానర్లు పెట్టాలన్నారు.జిల్లాలో రెమిడిసివర్‌, ఆక్సిజన్‌ ‌కు ఎలాంటి కొరత లేదన్నారు. ప్రభుత్వ దవాఖానలలో అవసరమైన కోవిడ్‌ ‌పేషెంట్లకు ఉచితంగా ఇస్తున్నామన్నారు. రెమిడిసివర్‌ ఎక్కడైనా బ్లాక్‌ ‌మార్కెటింగ్‌ ‌చేస్తున్నట్లు దృష్టికి వస్తే వారిపై పీడీ యాక్ట్ ‌పెట్టి కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.ఇంటింటి సర్వే లో గుర్తించిన కోవిడ్‌ ‌లక్షణాలు గల వారిని ఐసోలేషన్‌ ‌లో ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వారిని బయట తిరగనివ్వ వద్దని, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ‌చేయాలని సూచించారు. మందులు వాడుతున్నారా ఏదైనా సమస్య ఉందా తదితర విషయాలను తెలుసుకునేలా రెగ్యులర్గా మానిటరింగ్‌ ‌చేయాలని డి ఎం అండ్‌ ‌హెచ్‌ ఓ ‌కు సూచించారు. జిల్లా కలెక్టర్‌ ,అదనపు కలెక్టర్‌ ‌లు పూర్తిస్థాయిలో కోవిడ్‌ ‌పై దృష్టి సారించాలన్నారు. కోవిడ్‌ ‌పేషెంట్లకు బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని, పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని డి సి హెచ్‌ ఎస్‌ ‌కు ఆదేశించారు. త్వరలో కోవిడ్‌ ‌వార్డును సందర్శిస్తారని మంత్రి చెప్పారు.జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్ ‌లో కూడా రెడిమిసీవర్‌ అం‌దుబాటులో ఉందని, దవాఖానల లో ఉన్నా బయటకు రాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ‌కు సూచించారు.ఎక్కడ ఆక్సిజన్‌ ‌కొరత ఉండడానికి వీల్లేదని, ముందుగానే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, డి ఎం అండ్‌ ‌హెచ్‌ ఓ ‌పర్యవేక్షించి ఆ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కోవిడ్‌ ‌లక్షణాలు, పాజిటివ్‌ ‌రాగానే ప్రజలు భయాందోళనలతో అనవసరంగా ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌కు , హైదరాబాద్‌ ‌కు పరిగెత్త వద్దని జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలలో కోవిడ్‌ ‌బాధితులకు పూర్తి వైద్య సదుపాయాలు, మెరుగైన చికిత్స మందులు అందుబాటులో ఉన్నాయని , ఉచిత వైద్య సేవలు అందిస్తారని అవగాహన కల్పించి వారికి మనోధైర్యాన్ని భరోసాను కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ ‌లో జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ ‌లు రాజర్షి షా, వీరారెడ్డి, ఎంపీ లు బి బి పాటిల్‌, ‌కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కోవిడ్‌ ‌జిల్లా ప్రత్యేక అధికారి రాజు గౌడ్‌, ‌డిఎంఅండ్హెచ్‌ఓ ‌గాయత్రి దేవి, డి సి హెచ్‌ ఎస్‌ ‌సంగారెడ్డి, రెవిన్యూ డివిజనల్‌ అధికారులు, సిటీ స్కానింగ్‌ ‌కేంద్రాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply