నాగర్ కర్నూల్,జులై 28. ప్రజాతంత్రవిలేకరి: రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీమతి దేవసేన మంగళవారం జిల్లాల విద్యాశాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల పంపిణీ, ఏకరూపదుస్తులు, ఆగస్టులో ప్రారంభం కానున్న ఆరో తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులపై జిల్లాల వారీగా సమీక్షించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ విధులు నిర్వహించాలన్నారు. ఆగస్టు మాసం నుండి ప్రారంభం కానున్న ఆన్లైన్ తరగతులపై డిఇవోల అభిప్రాయాలను సేకరించారు. ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న ప్రతి విద్యార్థి వద్ద పుస్తకాలు ఉండాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆన్లైన్ తరగతులు పై ఉన్న సమస్యలను ఎలా అధిగమించాలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రతి పాఠశాలను సర్పంచుల ఆధీనంలో గ్రామ పంచాయతీల ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించేలా కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సిద్దంగా ఉన్నాం – డిఈఓ గోవిందరాజులు