రక్తదాతల జాబితాను కేటీఆర్‌కి అందజేత
- ఒక్క రోజులోనే వెయ్యి యూనిట్ల రక్తాన్ని సేకరించాం
- తలసేమియా, కరోనా బాదితులను ఆదుకోవడమే లక్ష్యం
- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట నియోజకవర్గంలో సేకరించిన 5610 మంది రక్త దాతల జాబితాను టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అందజేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మట్లాడారు. ఇప్పటికే 1000 యూనిట్ల రక్తాన్ని ఐఆర్సీఎస్ ద్వారా ఒక్కరోజులోనే సేకరించి ప్రభుత్వానికి అందచేశామని కేటీఆర్‌కు తెలిపినట్లు చెప్పారు. రాష్ట్రానికి సరిపడేంత రక్తాన్ని ఇవ్వడానికి నర్సంపేట సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే రక్తం కావాలంటే 48 గంటల ముందు తెలియపర్చాలని ప్రభుత్వానికి కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కరోనా, తలసేమియా బాధితులను ఆదుకోవడమే మా లక్ష్యమని కేటీఆర్‌కు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక యూనిట్ల రకాన్ని సేకరించి ఈ ఆపత్కాల పరిస్థితుల్లో కోవిడ్-19 కరోనా వైరస్, తలసేమియా బాధితులను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ఆయన అన్నారు. 6 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమ య్యాయని ఆయన తెలిపారు.
ఇప్పటికే 1000 యూనిట్ల రక్తాన్ని ఒక్క రోజులోనే సేకరించి ప్రభుత్వానికి అందచేశామని చెప్పారు. మిగతా 5610 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడానికి దాతల నమోదు ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. ఈ జాబితాను టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ప్రగతి భవన్లో అందచేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి సరిపడేంత రక్తాన్ని ఇవ్వడా నికి నర్సంపేట సిద్ధంగా ఉందని, రాష్ట్రం, దేశంలో ఎక్కడైనా సరే రక్తం అవసరముంటే 48 గంటల ముందే తెలియపరిస్తే, స్వంత ఖర్చులతో ధాతలను పంపియడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున రక్తధానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన యువతకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందుకు సహకరించిన పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య, మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులు, ఐఆర్సీఎస్, సీహచ్ఎస్, ఐఎమ్మెఏ సిబ్బందికి ధన్యవాదాలు తెలియచేశారు.