Take a fresh look at your lifestyle.

అటు విచారణ…ఇటు శాఖ తొలగింపు వాట్‌ ‌నెక్సట్?

  • ప్రభుత్వానికి నివేదిక అందజేత
  • భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోకతప్పదు: ఈటల హెచ్చరిక
  • గులాబీతో ఈటల చెలిమి ముగిసినట్లేనా?
  • శామీర్‌పేట, చిన్నకోడూరు, కమలాపూర్‌లలో రాజేందర్‌ అనుచరుల నిరసనలు

రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో రాజకీయాలు హీటెక్కాయి. శనివారం రోజంతా  క్షణ క్షణం నరాలు తెగే ఉత్కంఠగా నడిచాయి.  మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో పాటు అడుగులో అడుగు వేస్తూ..ఉద్యమానికి, కేసీఆర్‌ అం‌డగా, వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న తమ నాయకుడు రాజేందర్‌ను మంత్రి పదవీ నుంచి తొలగించేందుకు లేని ఆరోపణలతో బదునాం చేస్తున్నారనీ ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. అటు హుజురాబాద్‌, ఇటు శామీర్‌పేట-యంజాలలో నిరసనకు దిగారు.  మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తమ పని తాము చేసుకుపోతోంది. ఇప్పటికే రెవెన్యూ,విజిలెన్స్ అధికారులు మాసాయిపేట మండలంలోని జమున హ్యాచరిస్‌ ‌వద్ద డిజిటల్‌ ‌సర్వే  చేశారు. ప్రాథమిక నివేదికలో రాజేందర్‌ ‌భూ కబ్జాకు పాల్పడినట్లు తేలిందనీ జిల్లా కలెక్టర్‌ ‌మహేష్‌ ‌చెప్పారు.

నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా సిఎం కేసీఆర్‌కు అందజేసినట్లు విశ్వసనీయసమాచారం. ఓ పక్కన  రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జాల ఆరోపణలకు సంబంధించి అచ్చంపేటలో క్షేత్రస్థాయిలో విజిలెన్స్, ‌రెవెన్యూ అధికారులు విచారణ చేస్తుండగానే…మరోవైపు రాజేందర్‌ ‌నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను సిఎం కేసీఆర్‌ ‌సిఫారుసు మేరకు రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై కేసీఆర్‌కు బదిలీ చేశారు. శామీర్‌పేటలోని యంజాలలోని స్వగృహంలోనే ఉన్న రాజేందర్‌ ‌తన శాఖ తొలగింపుపై స్పందించారు. శాఖ తొలగించడం సంతోషంగా ఉందన్నారు. అయితే, భవిష్యత్‌లో మాత్రం తగు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

Protests by Rajender's followers in Shamirpet, Chinnakoduru and Kamalapur

తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన తర్వాత తన భవిష్యత్‌ ‌కార్యాచరణను ప్రకటిస్తాననీ రాజేందర్‌ ‌మీడియా ముఖంగా చెప్పారు. అయితే, ఇంకోవైపు విజిలెన్స్, ‌రెవెన్యూ అధికారులు అచ్చంపేటలో బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రూపొందించిన నివేదిక కూడా సిఎం కేసీఆర్‌ ‌టేబుల్‌పైకి చేరడంతో… ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

అయితే, వాట్‌ ‌నెక్సట్? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో రాజేందర్‌ ‌వ్యవహారంపై వాడి వేడిగా చర్చసాగుతోంది. ఈటల రాజేందర్‌ ‌వద్ద ఉన్న మంత్రిత్వ శాఖలను తొలగించి తనకు బదిలీ చేసుకున్న సిఎం కేసీఆర్‌ ‌రాజేందర్‌పై  ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, తాజా పరిణామాలను క్లోజ్‌గా పరిశీలిస్తున్న వారు మాత్రం టిఆర్‌ఎస్‌తో రాజేందర్‌ ‌బంధం తెగినట్లేననీ అంటున్నారు.

Leave a Reply