Take a fresh look at your lifestyle.

ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా నిరసనలు

కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ ‌చేసిన పోలీసులు
శ్రీకాకుళం, మే 3 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకోలకు సిద్ధమైన వామపక్ష, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ ‌చేశారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక అంబేద్కర్‌ ‌కూడలి వద్ద రాస్తారోకోకు సిద్ధమైన సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, సిపిఐ నాయకులు కొమర భాస్కర రావు తదితరులను అరెస్ట్ ‌చేసి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఇచ్చాపురం నుండి పైడిభీమవరం వరకు వామపక్ష కార్యకర్తలను, వివిధ ట్రేడ్‌ ‌యూనియన్ల నాయకులను  అర్ధరాత్రి నుంచి అక్రమంగా అరెస్టులు చేయడానికి సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అదానికి ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు .కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు నిర్మాణం కోసం  5,490 కోట్లు ఇస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పన్నులు, డివిడెండ్లు రూపంలో 50 వేల కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించిందని అన్నారు. కరోనాకాలంలో బీజేపీ ప్రభుత్వం ఆక్సిజన్‌ ‌దేశవ్యాప్తంగా అందజేయలేక చేతులెత్తేస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దేశవ్యాప్తంగా లిక్విడ్‌ ఆక్సిజన్‌ ‌ప్రజలకు అందించిందని ఆయన అన్నారు. ఈరోజు మూడు లక్షల కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉందని అన్నారు. దీనిని కార్పొరేట్‌ ‌సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టడానికి బిజెపి ప్రభుత్వం పూనుకొంటుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ఎలాంట్‌ ‌కు ముడిసరుకు పరిశ్రమకు రాకుండా అడ్డుకుంటుం దని విమర్శించారు.

Leave a Reply