Take a fresh look at your lifestyle.

ఆస్తిపన్నుకు వ్యతిరేకంగా నిరసనలు పట్టణ పౌరసమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా

విజయవాడ,జూన్‌16 : ఆస్తి పన్ను, చెత్త పన్ను భారాలకు వ్యతిరేకంగా… పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ బీసెంట్‌ ‌రోడ్‌లోని అన్సారీ పార్క్ ‌వద్ద విహెచ్‌ఆర్‌ ‌కాంప్లెక్స్ ‌లో ఉన్న వార్డు సచివాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. వినూత్నరీతిలో ప్రదర్శనలిచ్చి నిరసన తెలిపారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేసే చట్ట సవరణల నోటిఫికేషన్లను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధప్రదేశ్‌ ‌పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ ‌సిహెచ్‌.‌బాబూరావు, జిల్లా నాయకులు డి.కాశీనాథ్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

ఆస్తి పన్నుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల వద్ద జరుగుతున్న ధర్నాలో భాగంగా… పెడన పట్టణం మూడో నెంబర్‌ ‌సచివాలయం వద్ద పట్టణ పౌర సంక్షేమ సంఘం పెడన కన్వీనర్‌ ‌గోరురాజు ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 196, 197, 198 జిఒ లను రద్దు చేయాలని కోరుతూ సచివాలయ సెక్రటరీకి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పంచల నరసింహారావు, వాసా గంగాధర రావు, గుంటూ నాగభూషణం, తిరువీధుల బాపనయ్య, సమతం సత్యనారాయణ, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply