Take a fresh look at your lifestyle.

‌ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ నిరసనలు

  • వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌ ఆం‌దోళన
  • కరీంనగర్‌లో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం
  • పలుచోట్ల వినూత్నంగా మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రధాని మోదీ హైదరాబాద్‌ ‌వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిరసనలు మిన్నంటాయి. ప్రధాని రెండు రోజులపాటు నగరంలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్సీ వర్గీకణను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ ఎంఆర్‌పీఎస్‌ ‌కార్యకర్తలు యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ ‌సపంలోని ధర్మోజీగూడ వద్ద జాతీయరహదారిపై ధర్నా చేపట్టారు. టైర్లు కాల్చివేసి రోడ్డుపై బైటాయించారు. మోదీ గో బ్యాక్‌ అం‌టూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ నాయకులు కరీంనగర్‌లో ధర్నాకు దిగారు. కరీంనగర్‌లోని కమాన్‌ ‌చౌక్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక నేరగాళ్ల వేషంలో ఉన్న కొందరు బై బై మోదీ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. తాము బ్యాంకును మాత్రమే దోచుకుంటామని, రు మొత్తం దేశాన్నే దోచుకుంటున్నారని పేర్కొంటూ నిరసన వ్యక్తంచేశారు. ఖమ్మంలో ఎంఆర్‌పీఎస్‌ ‌సడక్‌ ‌బంద్‌ ‌నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నాయకన్‌ ‌గూండో వద్ద ఖమ్మం-సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పటికీ ఆ హాని నెరవేర్చకపోవడంతో నిరసనకు దిగారు.

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో ప్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. పలు చోట్ల ’సాలు మోదీ.. సంపకు మోదీ’ అని ప్లెక్సీలు వెలియగా.. నేడు మరింత వినూత్నంగా ప్రధానికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వనస్థలిపురంలోని పెట్రోల్‌ ‌బంక్‌,‌బ్యాంకులముందు వినూత్న ఒక దోపిడీ దొంగ బొమ్మ ఓ ప్లకార్డుతో దర్శనమిస్తోంది. ఆ ప్లకార్డులో ’మేము బ్యాంకులను మాత్రమే దోచుకుంటే.. నువ్వు ఏకంగా దేశాన్నే దోచేశావు… బై బై మోదీ’ అని రాసి ఉంది. వీటిని జనం చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Leave a Reply