Take a fresh look at your lifestyle.

బ్లాక్‌ ‌డే సందర్భంగా ఎపి వ్యాప్తంగా నిరసనలు

పలుచోట్ల నల్లజెండాలు ఆవిష్కరించి ధర్నాలు

విజయవాడ,మే 26: కేంద్రం ఏకపక్షంగా తీసుకువచ్చని మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, విద్యుత్‌ ‌బిల్లు చట్ట సవరణకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన ’బ్లాక్‌ ‌డే’ పిలుపు మేరకు భారీ స్పందన వస్తోంది. ఎపిలో పలుచోట్ల రైతులు నిరసలను దిగారు. లెఫ్‌ ‌కార్మిక సంఘాల నేతలు ధర్నాలు చేపట్టాయి. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం 6 నెలలు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగరవేసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతు, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళ, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఈ నిరసనలు మిన్నంటాయి.

కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను విడనాడాలని లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని నిరసనకారులు ఆందోళన చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు,ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగిన కార్యక్రమంలో వివిధ రైతు,కార్మిక, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా నల్ల జెండా ఆవిష్కరించారు. పలుచోట్ల నల్లజెండాలతో సిపిఎం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా విశాఖ జివిఎం గాంధీ బొమ్మ దగ్గర అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ ‌నరసింహ రావు, ఎం జగ్గు నాయుడు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. బ్లాక్‌ ‌డే నిరసన కార్యక్రమం అనంతలో మున్సిపల్‌ ‌వర్కర్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఆఫీస్‌ ‌బేరర్స్ ‌నాగభూషణం లక్ష్మీనారాయణ, నాగరాజు మున్సిపల్‌ ‌వర్కర్స్ ‌యూనియన్‌ ‌నాయకులు ఆదినారాయణ, తిరుమలేశ, ఎర్రిస్వామి, వరలక్ష్మి, రామాంజనేయులు, ఆదిశేషు, ప్రభాకర్‌ ‌తదితరులు పాల్గనడం జరిగింది. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని తణుకులో నిరసన తెలియజేసారు. బ్లాక్‌ ‌డే సందర్బంగా కర్నూలులో కష్ణదేవరాయలు సర్కిల్‌ ‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Leave a Reply