Take a fresh look at your lifestyle.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ప్ల కార్డులతో నిరసన

మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిద్ధిపేట అంబేడ్కర విగ్రహం వద్ద ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్న సిపిఎం నేతలు కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం దేశవ్యాప్తంగా ఇచ్చిన  నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం సిద్దిపేట పట్టణంలోని అంబేడ్కర్‌ ‌విగ్రహం వద్ద సిపిఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో  ప్ల కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టింది. కార్డ్ ‌లతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు రేవంత్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ…లాక్‌డౌన్‌ ‌సమయంలో కొరోనాను ఎదుర్కోవడంలో ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కేవలం కార్పొరేట్‌ ‌సంస్థలకు జపం చేస్తూ ఊడిగం చేస్తోందనీ మండిపడ్డారు. కష్టకాలంలో పేద ప్రజలను, వలస కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, కొరోనా వైరస్‌ ‌విస్తరిస్తున్న సమయంలో కొరోనా టెస్టులు అధిక సంఖ్యలో చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయన్నారు. ఆదాయ పన్ను పరిమితి కంటే దిగువన ఉన్న కుంటుంబానికి 6 నెలల పాటు నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి పని దినాలు 200కు పెంచాలని, విద్యుత్‌ ‌బిల్లులు ప్రభుత్వం భరించాలని,రేషన్‌ ‌కార్డు తో సంబంధం లేకుండా ప్రతి కుంటుంబానికి రేషన్‌ ‌బియ్యం ఇవ్వాలని,జాతీయ సంపదను కొల్లగొట్టి విధానాలను ఆపాలని,పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపును ఉపసంహరించుకోవాలి,కార్మిక చట్టాల రద్దును ఆపాలని రేవంత్‌ ‌డిమాండు చేశారు. ఈ నిరసన  కార్యక్రమంలో  నాయకులు పురుషోత్తం, బాబు రావు, నర్సింలు, లక్ష్మినారాయణ, నాగరాజు, వినోద, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply