Take a fresh look at your lifestyle.

మే నెల నుండి పూర్తి జీతాలివ్వాలని నిరసన

నాగర్‌కర్నూల్‌, ‌మే 23(ప్రజాతంత్ర విలేకరి):ఉపాధ్యాయులు ఉద్యోగస్తు లు పెన్షనర్ల  కాంట్రాక్టు సిబ్బందికి మే నెల నుండి పూర్తి జీతాల  చెల్లింపుకోసం రాష్ట్ర వ్యాప్తంగా శనివారం దీక్షలను చేపట్టింది. గత కొంత కాలంగా కోవిడ్‌ 19 ‌కారణంగా నెలకొన్న లాక్‌ ‌డాన్‌ ‌పరిస్థి తుల్లో రాష్ట్ర ఉద్యోగులకు ఉపా ధ్యాయులకు పెన్షనర్లకు  కాంట్రాక్టు సిబ్బందికు మార్చి నెల నుండి  50 శాతమే  ప్రభుత్వం జీతం చెల్లించుచున్నది కావున గత మూడు నెలల నుండి ఆర్థికగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు కాంట్రాక్టు ఉద్యోగస్తు ల పూర్తిస్థాయి చెల్లించాలని  రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడ రేషన్‌ ‌కుటుంబసహా గృహ దీక్షలు పిలుపునిచ్చిన  నేపథ్యంలో  జిల్లాలో వందలాది కుటుంబాలు దీక్షలను చేపట్టడం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో తమ తమ కుటుంబాలతో ఇంట్లోనే ఉంటూ ప్లకార్డు లు, బ్యాడ్జీల తో నిరసన వ్యక్తం చేశారు.  లోన్లు , ఇతర ఖర్చులు వాయిదా పడ టం వల్ల ఉద్యోగస్తులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ,బ్యాంకులు మారటోరియం విధించినప్పటికీ లోన్లు వసూలు చేస్తున్నారని, వాయిదా పడ్డ లోన్లకు వడ్డీ కూడా జమ చేయ బడుతుంది దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని తెలియజే శారు.  రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్‌, ‌కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పూర్తి వేతనాలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ‌టీఎస్‌ ‌యూటీఎప్‌ ‌జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖాన్‌, ‌శ్రీధర్‌శర్మ తెలిపారు.  తీర్పతయ్య, సలీం వహీదుఖాన్‌ ,‌రమాదేవి, నజిమ, నరసింహ తమ కుటుంబాలతో దీక్షలు నిర్వహించారు.

కాగజ్‌నగర్‌లో..
కాగజ్‌నగర్‌ :  ‌తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, ఫించనర్ల ఐక్య వేధిక రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మే నెల పూర్తి జీతం చెల్లించడంతో పాటు మార్చి, ఏప్రిల్‌ ‌నెలల బకాయిలు కూడా త్వరగా విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ కొమురం భీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా ఐక్య వేధిక నాయకులు బాలాజీనగర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టిఎస్‌యుటిఎఫ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి వి.శాంతికుమారి, డిటిఎఫ్‌ ‌జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజకమలాకర్‌ ‌రెడ్డి లు మాట్లాడుతూ మే నెల వేతనాలలో ఫించన్‌లలో కూడా కొత విధించాలంటూ ప్రభుత్వం ట్రెజరీలకు అంతర్గత ఆదేశాలివ్వడం దుర్మార్గమని, మార్చి,ఏప్రిల్‌ ‌నెలల వేతనాల్లో కొత విధించనందుకే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఫించనర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వరుసగా 3వ నెల కూడా కోత విధిస్తేకుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారుతుందని, కేంద్ర ప్రభుత్వం గాని, ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ స్థాయిలో వేతనాలలో కొత విధించలేదని, ఆంద్ర ప్రదేశ్‌లో కూడా మే నెలలో పూర్తి వేతనాలు చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. మే నెల పూర్తి జీతం చెల్లించడంతో పాటు మార్చి, ఏప్రిల్‌ ‌నెలల బకాయిలు కూడా త్వరగా విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వి.శాంతికుమారి, సభ్యులు శ్రీనివాస్‌, ‌స్పందన, ప్రవళిక, దీత్య, శ్రీనాథ్‌లు పాల్గొన్నారు.

Leave a Reply