Take a fresh look at your lifestyle.

ఎస్‌టిఓ కార్యాలయం ముందు నిరసన

ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్షెనర్లు పబ్లిక్‌ ‌సెక్టారు అండ్‌ ‌కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపుమేరకు సోమవారం నాడు వరుసగా 3 నెలల వేతనాలుపెన్షన్‌లో కోతలు విధించడాన్ని వ్యకితిరేకిస్తూ భద్రాచలం డివిజన్‌ ‌కేంద్రంలోని ఎన్‌టిఓ కార్యాలయం ముందు ఆల్‌ ‌పెన్షనర్స్ ‌రిటైర్డ్ ‌పర్సన్స్ అసోసియేషన్‌ ‌భద్రాచలం డివిజన్‌ ‌కమిటి ఆధ్వర్యంలో ప్లకార్డులను పట్టుకుని వృద్దులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఎంతో క్రమశిక్షణతో ఎండను కూడ లెక్కచేయకుండా పెన్షన్లను తిరిగి ఇప్పించాలని , ఐఆర్‌, ‌పిఆర్‌సి ఇప్పించాలని నినాదించారు.

అనంతరం మోమొరాండంను ఎస్‌టిఓ సిబ్బంది సీనియర్‌ అసిస్టెంట్‌ ‌క్రాంతి కుమార్‌కు సమర్పించి ప్రభుత్వానికి పంపిచాలని కోరారు. మెమోరాండంను రాష్ట్ర టిఏపిఆర్‌సిపిఏ ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీ యంవిఎన్‌ ‌నారాయణ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎల్‌వి ప్రసాద్‌, ‌కృష్ణమూర్తి, కోశాధికారి సుబ్బయ్య సమర్పించారు. ఈ కార్యక్రమంలో యంవిఎస్‌ ‌నారాయణ, నాళం సత్యనారాయణ, డిఎస్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply