Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రైవేటీకరణ విధానాలపై నిరసన

విశాఖలో కార్మిక సంఘాల మానవహారం
విశాఖపట్టణం,జూలై23 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రక్షణ రంగంలోని ఆర్డినెన్స్ ‌ఫ్యాక్టరీలను కార్పొరేటీకరణ చేయటం, ఉద్యోగులపై నిర్బంధం ప్రయోగించే ఎసెన్షియల్‌ ‌డిఫెన్స్ ‌సర్వీస్‌ ఆర్డినెన్సు(ఇడిఎస్‌ఓ) ‌విధించడాన్ని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల, వైజాగ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ తీవ్రంగా నిరసించింది. ఈ మేరకు కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్‌ఐసి దరి అంబేద్కర్‌ ‌విగ్రహం వద్ద నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆసీల్‌ ‌మెట్ట జంక్షన్‌ ‌వద్ద కొంతసేపు మానవహారం నిర్వహించి వాహనాలను కదలకుండా చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల జెఎసి చైర్మన్‌ ఎం ‌జగ్గునాయుడు డియాతో మాట్లాడుతూ, కేంద్ర బిజెపి ప్రభుత్వం రక్షణ రంగంలోని ఆర్డినెన్స్ ‌ఫ్యాక్టరీలను కార్పోరేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గమన్నారు.

రక్షణ రంగ ఉద్యోగులపై (ఇడిఎస్‌ఓ) అత్యవసర చట్టం ప్రయోగించటంను రద్దు చేయాలన్నారు. రక్షణ రంగ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల కార్మిక రైతు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళన చేస్తున్నా విశాఖపట్నం స్టీల్‌ ఎ•-‌లాంట్‌ ‌ను ప్రైవేటీకరణ పక్రియను మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌ ‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ ‌కె రెహమాన్‌, ఎ.ఐ.ఎఫ్‌.‌టి.యు జిల్లా ఆధ్యక్షుడు గణెళిష్‌ ‌పండా, సిఐటియు నగర కార్యదర్శి బి జగన్‌, ‌వై కొండయ్య, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె వెంకటలక్ష్మి, అరుణోదయ, నగర కార్యదర్శి కె నిర్మల, కె కుమారి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply