Take a fresh look at your lifestyle.

కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన దీక్షలు

మందమర్రి, మే 20, ప్రజాతంత్ర విలేఖరి : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 22న జాతీయ సంఘం ఆధ్వర్యం లో నిరసన దీక్షను చేపట్టనున్నట్లు ఐఎన్‌టియుసి సెంట్రల్‌ ‌సీనియర్‌ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సిద్ధం శెట్టి రాజమౌ ళి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిద్ధంశెట్టి రాజమౌళి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మిక చట్టాలను కుదిస్తూ కార్మిక సంఘాలపై కుట్రలకు పాల్పడటం జరుగుతుం దని ఆయన మండిపడ్డారు. దేశంలో 50 బొగ్గు గనుల ను ప్రైవేటీకరణ గురించి, అలాగే విద్యుత్‌ ఉత్పత్తిని డిస్ట్రిబ్యూషన్‌ ‌కూడా ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడాన్ని దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా ఐఎన్‌టియుసి జాతీయ నేత జి.సంజీవరెడ్డి నాయకత్వంలో పది జాతీయ సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందు లో భాగంగానే ఈ నెల 22వ తేదిన ఒక్కరోజు దీక్షను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ దీక్షకు కార్మిక సంఘాలు కార్మికులు కార్మిక నాయకులు మద్దతు పలికి కార్మిక హక్కులను కాపాడాలని కార్మిక వ్యతిరేక శక్తుల ను తరిమికట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాలను పెట్టుబడిదారుల కు కార్పొరేట్‌ ‌శక్తులకు లాభం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందని ఆయన మండిపడ్డారు. సింగరే ణి యాజమాన్యం లే ఆఫ్‌ ఎత్తివేసి గనులు నడిపేందుకు సిద్ధమతుందని గనులలో పూర్తి రక్షణ చర్యలు చేపట్టాలని కరోనా విపత్తు దృశ్యం కార్మికులకు మాస్క్‌లు సరఫరా చేయాలని, అలాగే ప్రతి డిపార్టుమెంట్‌లో ధరల స్త్క్రీనింగ్‌ ‌మిషన్‌లను ఏర్పాటు చేయాలని ఆయన యాజమాన్యాన్ని కరోనా విపత్తు ఎదుర్కొంటున్న సింగరేణిలో సేవలు అందిస్తున్నగని కార్మికులకు ప్రత్యేకంగా 50 లక్షల రూపాయాలు ఇన్సూరెన్స్ ‌భీమా సౌకర్యం కల్పించాలని గనిలో ఇతర యాంత్రాలు పనిముట్ల వద్ద శానిటైజింగ్‌ ‌చేయించాలని ఆయన కోరారు. పుల్లూరు లక్ష్మణ్‌ ‌దేవి , భూమయ్య, బాబు, ఎం.డి.సర్వర్‌, ‌కారుకూరి తిరుపతి, సకినాల శంకర్‌, ‌కొప్పుల బాబు, ఐలయ్య, మల్లయ్య, ఎం.డి.ఖలీం, వెంకటేశ్వర్లు, ఐఎన్‌టియుసి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply