కొరోనా వైరస్ నుండి మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించే పది మానసిక టీకాలు: మన మనస్సు మనం అనుకున్నదానికంటే ఎక్కువ పని చేస్తుంది. మనస్సులలో అంతర్గతంగా కలిగే ఆలోచనలలో కారణం మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా మానవజాతి పురోగతిలో ఎలాంటి అంటు వ్యాధులనైనా ఎదుర్కోగలిగే శక్తిని, ఆ అంటు వ్యాధుల నిర్మూలనకు తన జ్ఞానాన్ని ఉపయోగించుకుని వాక్సిన్ లను కనుగొనడంలో మనిషి చరిత్రను సృష్టించాదనడంలో సందేహాం లేదు. కరోనా మహమ్మారి విజృంబిస్తున్న ఈ సమయంలో మనస్సును సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్య పరిరక్షణకు ఈ పది మానసిక టీకాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
1. ప్రోత్సాహం: మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. మనిషిలో ఒత్తిడి కలగడం అనేది సహజం. ఒత్తిడికి గల భావోద్వేగాలను గుర్తింఛాలి. నేను నా భావోద్వేగాలను బ్యాలన్సింగ్ చేసుకోగలుగుతాను మరియు నా బాధలను తీర్చుకోగలుగుతాను, భయపడను, అలా అని అశ్రద్ద చేయను, ప్రతి సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను అని మనసుకు సూచనలు ఇస్తూ ఉండాలి. ఇలా సూచనల ద్వారా శరీరానికి, మనసుకు చాలా విశ్రాంతి లభిస్తుంది.
2. సానుకూల ఆలోచనలు: సానుకూల ఆలోచనలతోటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. మంచి ఆలోచనతో మంచి పనులు చేయాలి. ఇరుగుపొరుగు వారికి, బంధువులకు సహాయపడే చేసే చిన్న చిన్న పనుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇతరుల పట్ల ఉండే సానుకూల ఆలోచనలతోటే నాకు పూర్తి సంతోషం దొరుకుతుందని అని అనుకోవాలి
3. నిబంధనలు పాటించడం: వ్యక్తిగత పరిశుభ్రత నిబంధనలను పాటించడంలో చొరవ తీసుకోవాలి. కోవిడ్ 19 వ్యక్తిగత పరిశుభ్రత నిబంధనలను గమనింఛాలి. నేను నా చేతులను శుభ్రంగా కడగాలి, ప్రతిరోజూ మాస్క్ ను ఉపయోగించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. నైతిక బాధ్యతను నిర్వర్తించాలి.
4. కలుపుగోలుతనం: కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారితో కలివిడిగా మాట్లాడుతూ ఉండాలి. అంతర్ముఖులు ఒంటరిగా ఉంటూ ఉంటారు. అంతర్ముఖుల ఆలోచనలలో మార్పు తెచ్చుకోవాలి. నేను సామాజిక ఒంటరిగా ఉన్నాను, కానీ నేను ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు. మానసిక మరియు మన శారీరక ఆరోగ్యం కోసం ఇతరులతో సామాజిక సంబంధాలు మెరుగు పరచుకోవాలి.
5. నమ్మకం: గతంలో ఇలాంటి ఎన్నో వైరస్ లు వచ్చాయి వాటిని అధిగమించడానికి టీకాలను కనుగొనడం జరిగింది. కరోనా వైరస్ కు కూడా ముగింపు పలికే రోజూ త్వరలోనే వస్తుంది. కొంత కాలం ఎక్కువైనప్పటికీ ఏదో ఒక రోజూ కరోనా వైరస్ ను కూడా మనిషి జయిస్తాడు అనే నమ్మకం ను పెంపొందించుకోవాలి.
6. బ్రీథింగ్ వ్యాయామం: ఎలాంటి ఖర్చు లేనిది ఉచితం గా లభించే ఈ బ్రీథింగ్ ఎక్సర్సైజు ను ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏ సందర్భంలోనైనా కొంత టెన్ సన్ అనిపిస్తే బ్రీత్ ఎక్షర్ సైజ 2,3 నిమిషాల పాటు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
7. భావోద్వేగాల బ్యాలెన్స్: శరీరం మరియు మనస్సు మధ్య సమతుల్యత కోల్పోవడం గందరగోళాన్ని సృష్టిస్తుంది. సరైన సమతుల్యతను కలిగి ఉండటానికి ప్రయత్నింఛాలి. భావోద్వేగానికి కారణం కనుగొనే ప్రయత్నం చేయాలి. ఆ కారణంనకు పరిష్కార దిశలో ఆలోచించాలి. భావోద్వేగ కారణాన్ని విశ్వసించాలి. తెలివిగా వ్యవహరించాలే తప్ప ఎక్కువ భావోద్వేగానికి గురికావద్దు.
8. నాలెడ్జ్ : కరోనా వైరస్ కు సంబంధించిన నాలెడ్జ్ ను పొందాలి. కరోన వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. కరోనా వైరస్ గురించి చాలా తప్పుడు సమాచారం ప్రచారమవుతోంది. ప్రభుత్వ సమాచార సాధనాలు, జాతీయ ఆరోగ్య నిపుణుల ద్వారా వచ్చే సమాచారం పై మాత్రమే దృష్టి పెట్టండి.
9. సమాచారం: కరోనా వైరస్ అనుమానాస్పద లక్షణాలు సంభవించినప్పుడు ఎక్కడ సంప్రదించాలో ముందుగానే సమాచారాన్ని సేకరించి అందుబాటులో ఉంచుకోవాలి. సహాయం ఎలా పొందాలో తెలుసుకోవాలి. కరోనా పరీక్షలకు సంబందించిన ల్యాబ్ లు, ప్రజారోగ్య కేంద్రం ల అడ్రస్ లు తెలుసుకోవాలి. లోలోపల మధనపడుతూ ఇంట్లోనే కూర్చొని ఆందోళన చెందాల్సిన పని లేదు. సహాయం చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి అని గుర్తించుకోండి.
10. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం: ప్రపంచ దేశాల్లో మానసిక ఒత్తిడి అనేది పెనుసమస్య. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు తొంభై రెండు శాతం మంది మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, చిక్కుళ్ళు, కార్బో హైడ్రేట్లు వంటివి తీసుకోవడం వల్ల మనసు నిర్మ లంగా ఉంటుంది. సమతుల ఆహారం శారీరక శ్రేయస్సును పెంపొం దిస్తుంది. సరైన నిద్ర, ధ్యానం మరియు శారీరక వ్యా యామం తో ఒత్తిడిని అదు పులో ఉంచుకో వచ్చు.