Take a fresh look at your lifestyle.

కార్పొరేట్‌ ‌చెర నుండి రైతును కాపాడాలి …

( జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్‌ 23)

కేంద్ర ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుందని కలలు కంటున్న అన్నదాతల కలలు కల్లలుగానే మిగిలి ,వారి ఆనందం, ఆశ ఆవిరై వారి జీవితాన్ని కార్పొరేట్‌ ‌కబంధ హస్తాలలో పెట్టే విధంగా నూతన వ్యవసాయక చట్టాలను తీసుకు వచ్చింది. ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు గత 6 రోజులుగా ఎముకలు కొరికే చలిలో ప్రాణాలు లెక్కడేయక ఉద్యమం చేస్తున్నారు. సాంప్రదాయక వ్యవసాయాన్‌ ‌కార్పొరేట్‌ ‌సంస్థలకు అప్పజెప్పడానికి పాలకులు ఈ కొత్త వ్యవసాయ సంస్కరణలు తీసుకు వచ్చారని రైతులు ఆగ్రహిస్తిన్నారు. రైతుల పంటను అమ్ముకునే వ్యవసాయ మార్కెట్‌ ‌లను దివాలా తీయించి కార్పొరేట్‌ ‌ద్వారాలు తెరస్తే మద్దతు ధరలు రద్దు అవుతాయి. కార్పొరేట్‌ ‌సంస్థలు రైతులతో భూ ఒప్పందాలు చేసుకునేటట్లు చట్టంలో ఉండటం వలన భూములను కార్పొరేట్లు కాజేసే అవకాశం ఉన్నదని రైతులు అంటున్నారు.

కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయన చందంగా రైతుల జీవితాలను బాగుపరిచి, అభివృద్ధి పథంలోకి నడిపిస్తారనే ఆశతో ఎదురు చూసిన అన్నదాతలను పూర్తిగా వ్యవసాయం నుండి నెట్టి కూలీలుగా మార్చి జీవితాలను దుర్భరం. రైతు పక్షం అని పలికిన ప్రభుత్వాలు చేతలలో అనుయాయులైన కార్పొరేట్‌ అధిపతులకు ఎర్రతివాచిలు పరిచి, సబ్‌ ‌కా సాత్‌, ‌సబ్‌ ‌కా వికాస్‌ ‌కు బదులు కార్పొరేట్‌ ‌కా సాత్‌ ‌కార్పొరేట్‌ ‌కా వికాస్‌ ‌గా వ్యవహరిస్తున్నారని రైతులంటున్నారు.

Protect the farmer from corporates

- Advertisement -

సత్వర, సంతులిత వృద్ధి సాధనకు వ్యవసాయరంగ అభివృద్ధి ప్రధాన ఆధారమని ఆర్థిక శాస్త్రవేత్త గున్నార్‌ ‌మిర్దాల్‌ అన్నట్లు మన దేశంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకున్నా నేటికీ వ్యవసాయ రంగమే ఆర్థిక వ్యవస్థ కు వెన్నెముకగా నిలిచింది అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయాదాయంతో ఎక్కువ భాగం వ్యవసాయ రంగం నుండే అందుతుంది . ఆహార కొరత రాజకీయ ఆస్థిరతకు దారితీస్తుంది. చైనా తాత్వికుడు కన్పుషియస్‌ ‘’‌పుష్కలమైన ఆహారం, బలీయమైన సైన్యం, ప్రజా విశ్వాసం చూరగొనటం పాలకుని లక్షణాల, అందులో ఏవో రెండు మాత్రమే లభిస్తే వాటిలో సైనిక శక్తిని మినహాయించుకోవాలి’’ అని చెప్పాడు.

కరోనా స్వైరవిహారం చేస్తున్న సమయంలో రైతు సంక్షేమం మరిచి , వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఉద్దేశంతో వ్యవసాయ చట్టం -2020 ని ఆమోదించింద. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో వ్యవసాయరంగ స్వరూపం పూర్తిగా మారిపోతుందా ?? రైతులకు లాభం చేకూర్చి వారి ఆదాయం రెట్టింపు అవుతుందా?? అలా అయితే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు, మేధావులు ఎందుకు ఈ బిల్లు పట్ల గగ్గోలు పెడుతున్నారు??

1) నిత్యావసర వస్తువుల ( సవరణ ) బిల్లు 202):: ఈ బిల్లు ప్రకారం ధాన్యం, నూనె గింజలు ,ఉల్లిగడ్డలు ,బంగాళదుంపలు నిత్యావసర వస్తువుల జాబితా నుండి తొలగించారు. చట్టంలో మార్పుల వల్ల వ్యాపా రులు ఎంతైనా సరుకులు నిల్వ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం వినియోగదారుల పై ఉంటుంది. ఉత్పత్తుల ఎగుమతుల పై ఆంక్షలు పెరిగితే రైతుకు నష్టమే.
( 2 ) రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్యం బిల్లుప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు కొనుగోళ్లకు రైతులు, ప్రైవేట్‌ ‌వ్యాపారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్‌ ‌యార్డులకు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ధరల నియంత్రణ రైతులు ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. రైతుల పేరిట కార్పొరేటర్లు కొన్ని లాభాలు వచ్చే దగ్గర అమ్ముకుంటారు. గుత్తా కార్పొరేట్‌ ‌సంస్థలు ప్రవేశించి లాభార్జనే ధ్యేయం గా పనిచేస్తాయి. వ్యవసాయ మార్కెట్‌ ‌లో గుత్తాధిపత్యం పెరిగి దేశీయ అవసరాలు తీర్చుకోకుండా అంతర్‌ ‌జాతీయ మార్కెట్‌ ‌లోకి వెళుతుంది.
( 3 ) రైతుల ధర హా మీ సేవల ఒప్పంద బిల్లు ప్రకారం రైతులు భవిష్యత్తులో పండించే పంటకు ముందుగానే ప్రైవేట్‌ ‌కంపెనీలతో ఒప్పందం కుదుర్చు కోవచ్చు. ఇదే కాంట్రాక్టు వ్యవసాయ విధానం. రైతులు తమ పంట ఉత్పత్తులను ఎవరికైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. బడా కార్పొరేట్‌ ‌కంపెనీలు చిన్న ,సన్నకారు రైతుల నుండి కాంట్రాక్టు వ్యవసాయం పేరిట భూములు లాక్కొని, వారినే కూలీలుగా మార్చే విధంగా వ్యవస్థ తయారవుతుంది.

ఈ కొత్త వ్యవసాయ విధానాన్ని పంజాబ్‌ ,‌హర్యానా రాష్ట్రాలు సహా దేశం అంతటా వ్యతిరేకిస్తున్నది. ఈ విధానం వల్ల రైతులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాం అంటున్నారు కానీ కార్పోరేట్‌ ‌లకు మాత్రమే స్వేచ్ఛ కలుగుతుంది. వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు చట్టఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతుల న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కరించి రైతుల ఆందోళన విరమింప చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాలకులు చిత్తశుద్ధితో రైతుల ప్రగతికి అభివృద్ధి బాటలు వేయాల్సిన అవసరం వుంది.
– సత్య ఫుల్లు, మహబూబాబాద్‌ …

Leave a Reply