Take a fresh look at your lifestyle.

ఓయూ భూములను కాపాడండి

గవర్నర్‌ను కోరిన టీజేఎస్‌ అధ్యక్షుడు, ప్రొ।।  కోదండరామ్‌

 ‌రాజభవన్‌లో తెలంగాణ గవర్నర్‌ ‌తమిళసైతో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ భూములను కాపాడాలని గవర్నర్‌ ‌కు విజ్ఞప్తి చేసినట్లు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఓయూ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరామని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యా వికాసానికే కాదని, మధ్య ఆసియా విద్యార్థులకు ఓయూ విద్యను అందిస్తోందని, యూనివర్సిటీలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంటోందన్నారు. గవర్నర్‌ ‌తన విచక్షాధికారంతో ఓయూ భూములను కాపాడాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.

Leave a Reply