Take a fresh look at your lifestyle.

ధరణి పోర్టల్‌లో స్పష్టంగా ఆస్థులను నమోదు చేయాలి: మంత్రి

వనపర్తి,సెప్టెంబర్‌,28(‌ప్రజాతంత్ర విలేకరి) : ధరణి పోర్టల్‌ ‌ద్వారా నమోదు చేస్తున్న ప్రజల ఆస్తులను తప్పులు లేకుండా సర్వేను జాగ్రత్తగా అధికారులు నిర్వహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు.మంగళవారం నాడు జిల్లా కలెక్టర్‌ ‌సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో జిల్లాలోని 5 మున్సిపాలిటిల చైరెపర్సన్‌, ‌వైస్‌ ‌చైర్‌పర్సన్స్ ‌కమీషనర్స్ ఇం‌జనీర్స్ ‌టిపిఎస్‌లతో సమావేశం ఏర్పాటు చేయనైనది. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ‌ద్వారా మున్సిపాలిటిలోని వ్యవసాయేతర ఆస్థులను ఆన్‌లైన్‌లో చేయాలని మెరూన్‌ ‌కలర్‌ ‌పుస్తకం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినుట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి తెలియజేశారు.

అందురు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి ఏఒక్క ఆస్థి యాజమానికి నష్టం జరగకుండా సర్వే నిర్వహించాలని ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌గొప్ప ఆలోచన తీసుకొచ్చారని గుర్తుచేశారు. అధికారులు తప్పులులేకుండా చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. చేరువు శికము ఎఫ్‌టిఎల్‌లో ని అక్రమాలను వక్ఫ్‌ప్రభుత్వ దేవాదాయ ఫారెస్టు రైల్వే ఇతర వివాస్పద భూములను డాక్యుమెంట్సు పరిశీలించిన క్షుణ్ణంగా నమోదు చేయాలని క్షేత్రస్థాయిలో ఏ అనుమానం వచ్చిన వెంటనే నివృత్తి చేసుకొని సరియైన పద్దతిలో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌యాస్మిన్‌ ‌బాష సూచించారు.సమావేశంలో వనపర్తి కొత్తకోట,పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటిలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply