Take a fresh look at your lifestyle.

అన్ని రంగాల్లో తెలంగాణ పురోగతి

దేశప్రగతి రేటుకన్న మనదే ఎక్కువ
2,653 కోట్ల అంచనా వ్యయంతో త్వరలోనే సంగమేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల 19 వేల ఎకరాలకు సాగునీరు
అసెంబ్లీలో మంత్రి హరీష్‌ ‌రావు

రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం శాసనసభలో మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడిన నాడు దేశం జీడీపీలో మన రాష్ట్రం జీఎస్‌డీపీ శాతం 4.06గా ఉండేంది. అయితే గత ఏడు సంవత్సరాల వరుస పెరుగుదలతో దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం వాటా 4.97 శాతం పెరిగిందన్నారు. ‘దేశం ప్రగతి రేటు కంటే మన ప్రగతి రేటు ఎక్కువగా ఉంది. దేశ వృద్ధికి కూడా రాష్ట్రం తోడ్పాటును అందిస్తుంది. దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. ప్రాథమిక రంగంలో రాష్ట్రం పురోగతి సాధించినట్లు నీతిఆయోగ్‌ ‌చెప్పింది. సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్‌ ‌ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా, రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నాం. గొర్రెలు, గేదెల పంపిణీ, డెయిరీ పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాం. వ్యవసాయ, అనుబంధం రంగాలపై ఏడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఆర్థిక సంఘం సిఫార్సులను పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసింది’ అని హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని, రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌ అం‌దిస్తున్నామని ఆయన చెప్పారు. సమైక్య పాలనలో నిర్వీర్యమైన కులవృత్తులకు పునర్‌ ‌వైభవం తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ, దాని అనుబంధం రంగాలపై ఏడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని అన్నారు.

2,653 కోట్ల అంచనా వ్యయంతో త్వరలోనే సంగమేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన
సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల 19 వేల ఎకరాలకు, బసవేశ్వర ఎత్తిపోతల పథకం కింద ఒక లక్షా 65 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. సంగమేశ్వర ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,653 కోట్లు, బసవేశ్వర ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,774 కోట్లతో నిర్మిస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్‌ ‌రావు సమాధానం ఇచ్చారు. కొన్ని దశాబ్దాల కల ఇవాళ నెరవేరబోతుంది. ఎన్నికల హావి•లను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి సాగునీరు, త్రాగునీరు, విద్యుత్‌ ‌సరఫరా అవుతుందన్నారు. జహీరాబాద్‌, ఆం‌దోల్‌ ‌నియోజకవర్గాలతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలోని 11 మండలాలకు సంగమేశ్వర లిప్ట్ ‌కింద సాగునీరు అందిస్తామన్నారు. మొత్తంగా 231 గ్రామాలకు సాగునీరు వొస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు 12 టీఎంసీల నీటిని సింగూరు ద్వారా ఎత్తిపోస్తాం. 3 పంప్‌ ‌హౌజ్‌లు, 6 ప్రధాన కాలువల ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. బసవేశ్వర లిప్ట్ ‌కింద నారాయణ్‌ఖేడ్‌, ఆం‌దోల్‌ ‌నియోజవర్గాల్లోని 8 మండలాలు, 166 గ్రామాలకు సాగునీరు అందిస్తాం. 8 టీంఎసీల నీటిని సింగూరు నుంచి ఎత్తిపోస్తాం. 2 పంప్‌ ‌హౌజ్‌లు, 6 ప్రధాన కాలువల ద్వారా సాగునీరు అందిస్తాం. ఒకట్రెండు మాసాల్లోనే టెండర్ల పక్రియ పూర్తి చేసి ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు టెండర్లు పూర్తి చేసి, పనులు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌?‌రావు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సిఎం కెసిఆర్‌ ‌చేతుల వి•దుగా ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తామని ఆయన చెప్పారు.

Leave a Reply