Take a fresh look at your lifestyle.

క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి: ‌కెటిఆర్‌

  • అన్ని రంగాల్లో దూసుకుపోతున్నం
  • పరిశ్రమలు, ఐటీ శాఖల వార్షిక నివేదిక విడుదల చేసిన కెటిఆర్‌
  • ఎరోస్పేస్‌ ‌సిటీస్‌ ‌కేటగిరీలో హైదరాబాద్‌కు తొలి ర్యాంక్‌ : ‌కెటిఆర్‌

రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించామని తెలిపారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖల వార్షిక నివేదికను గురువారం కేటీఆర్‌ ‌విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పారదర్శకత కోసమే వార్షిక నివేదిక విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ‌విధివిధానాలు, సమష్టి కృష్టితోనే ఈ రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందన్నారు. సీఎం దార్శనికతతో దేశంలో అగ్రగామిగా ఎదుగుతున్నామని కేటీఆర్‌ ‌వివరించారు. 2019-20లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లు అని.. అదే 2020-21లో రూ.1.45 లక్షల కోట్లు అని తెలిపారు. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పారదర్శకత కోసం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. కొరోనా కారణంగా సాదాసీదాగా కార్యక్రమం జరుపుతున్నామని చెప్పారు. 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9.78 లక్షల కోట్లుగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. దేశ తలసరి ఆదాయం రూ.1,27,768గా ఉండగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145గా ఉందన్నారు. 2019-20లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లు కాగా, 2020-21లో అవి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు.

ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామన్నారు. జాతీయస్థాయితో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగిత మెరుగ్గా ఉందని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, ఏడేండ్ల తర్వాత ఆ సంఖ్య రెట్టింపు అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఐటీ రంగం 6.28 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. సుమారు 20 లక్షలకు పైగా మంది ఐటీ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారని తెలిపారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను కేంద్రం ఆదుకోవాలని కోరారు. దీనికోసం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

మల్టీనేషనల్‌ ‌కంపెనీలు హైదరాబాద్‌కు వొస్తున్నాయని చెప్పారు. ప్రముఖ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయన్నారు. పెట్టుబడులు, అంకెలే తమ వృద్ధికి సంకేతం అని వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకూ శరవేగంగా ఐటీ విస్తరిస్తున్నదని తెలిపారు. కార్యాలయాల విస్తీర్ణంలో బెంగళూరును అధిగమించామని చెప్పారు. రామగుండం, సిద్దిపేట, నల్లగొండలోనూ త్వరలో ఐటీ టవర్లను ఏర్పాటుచేస్తామన్నారు. వొచ్చే రెండేండ్లలోనే ఐటీ టవర్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్‌ ‌రంగంలో రూ.4 వేల కోట్లు పెట్టుబడులు వొచ్చాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ ‌దివిటి ప్రాంతంలో త్వరలో సోలార్‌ ‌పార్క్‌ను ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు. గత ఐదేండ్లుగా మంత్రి కేటీఆర్‌ ‌తన శాఖ వార్షిక నివేదికలను విడుదల చేస్తున్నారు.

ఎరోస్పేస్‌ ‌సిటీస్‌ ‌కేటగిరీలో హైదరాబాద్‌కు తొలి ర్యాంక్‌ : ‌కెటిఆర్‌
‌వ్యయ సమర్థత విషయంలో టాప్‌ 10 ఏరోస్పేస్‌ ‌సిటీస్‌ ‌కేటగిరిలో హైదరాబాద్‌ ‌తొలి ర్యాంక్‌లో నిలిచిందని మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడించారు. ఎఫ్‌డీఐ ఏరోస్పేస్‌ ‌సిటీస్‌ ఆఫ్‌ ‌ద ఫ్యూచర్‌ 2020-21 ‌ర్యాంకింగ్స్ ‌గురించి మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖల వార్షిక నివేదికలను ఆయన విడుదల చేశారు. జాతీయ స్థాయిలో 2019 ఏడాదికిగాను సులభతర వాణిజ్యంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఇక నీతి ఆయోగ్‌ ‌విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్‌ ఇం‌డెక్స్ ‌రిపోర్ట్‌లో ప్రధాన రాష్ట్రాల కేటగిరీలో రాష్ట్రానికి నాలుగోస్థానం దక్కినట్లు తెలిపారు. ఇక ఇండియా ట్రేడ్‌ ‌ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐటీపీవో) 28వ కన్వర్జెన్స్ ఇం‌డియా 2021 ఇంటర్నేషన్‌ ఎగ్జిబిషన్‌, 6‌వ స్మార్ట్ ‌సిటీస్‌ ఇం‌డియా ఎక్స్‌పోలో హైదరాబాద్‌కు మూడు స్మార్ట్ ‌సిటీస్‌ ఇం‌డియా (ఎస్‌సీఐ) అవార్డులు దక్కినట్లు కేటీఆర్‌ ‌చెప్పారు. గ్రీన్‌ అం‌డ్‌ ‌క్లీన్‌ ‌సిటీ, స్మార్ట్ ‌వేస్ట్ ‌డిస్పోజల్‌, ‌స్టార్టప్‌ ‌కేటగిరీల్లో ఈ అవార్డులు వొచ్చినట్లు తెలిపారు.

Leave a Reply