Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి :కేంద్రం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ :ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి  వచ్చిందని సమగ్ర శిక్ష పథకంలో ఏపీ గణాంకాలు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి మరుగుదొడ్లతో సహా మౌలిక సదుపాయాల కల్పన మరియు వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు సమగ్ర శిక్ష పథకం కింద మద్దతు ఇస్తున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు.

ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో 18,391 బాలుర మరుగుదొడ్లు, 21,199 ప్రత్యేక బాలికల మరుగుదొడ్లు, ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం 3,102 మరుగుదొడ్లు మంజూరు చేశామన్నారు. అందులో ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో 17,400 బాలుర మరుగుదొడ్లు, 20,548 ప్రత్యేక బాలికల మరుగుదొడ్లు, సిడబ్లు్యఎస్‌ఎన్‌కు 3,045 మరుగుదొడ్లు నిర్మించినట్లు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

Leave a Reply