Take a fresh look at your lifestyle.

నియంత్రిత సాగుతో రైతుకు లాభం

  • వానాకాలం సాగు ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా,రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ కృషి చేస్తుంది అలాగే నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వానాకాలం సాగు ప్రణాళిక పై సోమవారం ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌, ‌వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ‌రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు బంధు సమితి సమన్వయకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మని, ఎకరానికి రూ.10 వేలు(2 పంటలకు) పెట్టుబడి సాయం, రూ.5 లక్షల రైతు బీమా వంటి పథకాలను కట్టుది ట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో మన రాష్ట్రంలో నీటిపారుదల రంగం, వ్యవసాయ రంగం నిర్లక్ష్యా నికి గురి అయ్యాయని, సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకు నేందుకు ప్రభుత్వం రెండు పర్యాయాలు రైతు రుణమాఫీ సైతం అమలు చేస్తుందని సీఎం తెలిపారు. గోదావరి, కృష్ణా నదులలో ఉన్న మన వాటాను సంపూర్ణంగా వినియోగించు కునేందుకు భారీ ఎత్తున నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని సీఎం అన్నారు. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో ఉన్న పెండింగ్‌ ‌ప్రాజెక్టులు పూర్తి చేసుకోని 11 లక్షల ఎకరాలకు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, దేవాదుల పనులు పూర్తి అవుతున్నాయని, త్వరలో సీతారాముల ప్రాజెక్టు పూర్తి చేసుకుని వానాకాలంలో సాగునీరు అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రస్తుత వానాకాలంలో ఎస్సారెస్పీ, కాళెశ్వరం దేవాదుల, కృష్ణా నది ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులు,చిన్న నీటి వనరులు, భూగ ర్భ జలాలతో సుమారు కోటి 30 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం అన్నారు. కోవిడ్‌ 19 ‌వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 35 వేల కోట్ల తో రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేస్తుందని సీఎం తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం మొత్తం పంటను కొనుగోలు చేయడం సాధ్యం కాదని సీఎం అన్నారు. 2019-20 సంవత్సరంలో రెండు పంటలు కలిపి మన రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల్లో పత్తి, 79 లక్షల ఎకరాల్లో ధాన్యం, 20 లక్షల ఎకరాల్లో మొక్కజొ న్న, 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్‌, ‌కొంతమేర కందులు, కూరగాయలు, నిజామాబాద్‌ ‌జగిత్యాల నిర్మల్‌ ‌ప్రాంతాల్లో పసుపును రైతులు పండించారని తెలిపారు. రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటలను సాగు చేస్తే ఈ సంవత్సరం మీరు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సుమారు 4.5 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, మన రాష్ట్రంలో ఉన్న 2600 రైస్‌ ‌మిల్లు లో సామర్థ్యం 1.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సరిపోతుందని, రైతులు తీవ్రంగా నష్టపో యే అవకాశం ఉందని సీఎం తెలిపారు. నియంత్రిత పద్ధతి లో వ్యవసాయం చేయడం వల్ల రైతులకు నష్టం కలగకుం డా, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంట సాగు చేసి లాభం పొందుతారని సీఎం సూచించారు. తెలంగాణలో ఉన్న జయ శంకర్‌ ‌వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసా య అధికారులు రైతులు పండించిన పంట పై సూచనలు చేశారని సీఎం తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 65 లక్షల ఎకరాల్లో ధాన్యం (సన్నరకం తో కలిపి 40 లక్షలు వానాకాలంలో 25 లక్షలు యాసంగి లో) 10 లక్షల ఎకరాల్లో కందులు, యాసంగి లో మొక్కజొ న్న సాగు చేయాలని నిపుణుల కమిటీ సూచించిందనిన్నా రు. పత్తికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ ఉన్న నేపథ్యంలో ఎకరానికి సుమారు రూ. 50 వేల వరకు రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. రైతులు సన్నరకం ధాన్యం వైపు మొగ్గు చూపాలని, తెలంగాణ సోనా రకం ధాన్యంలో షుగర్‌ అతి తక్కువగా ఉంటుందని, దీన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు పరిశీలిస్తున్నా మని సీఎం తెలిపారు.

నియంత్రిత పద్ధతిలో సాగు చేయని వారికి రైతుబంధు సాయం నిలిపివేస్తున్నామని, జిల్లాలో ప్రతి రైతుకు రైతుబంధు సహాయం అందే విధంగా జిల్లా కలెక్టర్‌, ‌జిల్లా వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి సమన్వయకర్తలు కృషిచేయాలని కోరారు. రైతుబంధు పథకంలో కోతలు విధించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రతి రైతు నియంత్రిత పద్ధతిలో పంటలు పండించి, నియంత్రిత విధానంలో విక్రయించి మంచి లాభాలు పొందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 2604 క్లస్టర్ల వారీగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, ఇతర వ్యవసాయ వాహనాలు, వ్యవసాయ యంత్రాల వివరాలను సేకరించాలని, వ్యవసాయ యాంత్రీకరణ చేయుటకు అదనంగా అవసరమైన వాటిని ప్రతిపాదించాలని, దశలవారీగా ప్రభుత్వం వారికి సబ్సిడీ విడుదల చేస్తుందని సీఎం తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం కట్టుదిట్టంగా చేపడుతుందని, వ్యవసాయాధికారులు అందించే సూచనలను పాటిస్తూ దేశానికి ఆదర్శ వంతంగా రైతులు సాగు చేయాలని, మంచి లాభాలు పొందాలని సీఎం కేసీఆర్‌ ‌కోరారు. అనంతరంఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ‌రవి గుగులోతు మాట్లాడుతూ, ప్రస్తుత వానాకాలం పంటలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కజొన్న స్థానంలో పత్తిపంటను, కందులను ప్రోత్సహిస్తున్నమని, సన్నరకం ధాన్య సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. రైతు వేదికల నిర్మాణానికి గాను స్థల సేకరణ పూర్తి చేసి, త్వరగా పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే 15 రోజులు వ్యవసాయం పై అధిక శ్రద్ధ వహించి, నియంత్రిత సాగు సఫలీకృతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌లో అదనపు కలెక్టర్‌ ‌బి. రాజేశం, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆరుణశ్రీ, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌ ‌కుమార్‌, ‌జిల్లా హార్టికల్చర్‌ అధికారి ప్రతాప్‌ ‌సింగ్‌, ‌జిల్లా సహకార అధికారి రామానుజ చారి, సీపీఒ మల్లికార్జున్‌, ‌వ్యవసాయ శాఖ అధికారులు, ఆగ్రో రీజనల్‌ ‌మేనేజర్‌ ‌కాంతారావు, రైతుబంధు సమితి జిల్లా సమన్వయ కర్త వెంకట్రావు, మండలాల నుంచి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మార్కెటింగ్‌ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ‌లో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!