Take a fresh look at your lifestyle.

పోరాటం మిగిలే వుంది

“రాజకీయ పార్టీల కంటే రెట్టింపుగా తెలంగాణ సమాజంలోని మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, సాంస్కృతిక సంఘాలు తమ రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా, పాటల ద్వారా, రాష్ట్ర ఆవిర్భావం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాయి. కానీ తదనంతర కాలంలో ప్రజాసంఘాలు, పౌరసమాజం చిన్న చూపుకు గురియ్యాయి. ఉద్యమ కాలంలో తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న అన్ని ప్రజాసంఘాలను ఒక తాటిపైకి తీసుకురావడంలో జయశంకర్‌ ‌సార్‌ ‌సఫలీకృతుడయ్యాడు. జయశంకర్‌ ‌సార్‌కు రాజకీయ పార్టీలపట్ల ఏనాడు నమ్మకంలేదు. కానీ ప్రజా సంఘాలను బలంగా విశ్వసించేవాడు. పాలకులకు ప్రజాసంఘాల పట్ల ఆ విశ్వాసం లేదు.”

జయశంకర్‌ ‌సార్‌ ‌స్ఫూర్తిని కొనసాగిద్దాం… – తెలంగాణ విద్యావంతుల వేదిక

రాజకీయ పార్టీల కంటే రెట్టింపుగా తెలంగాణ సమాజంలోని మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, సాంస్కృతిక సంఘాలు తమ రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా, పాటల ద్వారా, రాష్ట్ర ఆవిర్భావం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాయి. కానీ తదనంతర కాలంలో ప్రజాసంఘాలు, పౌరసమాజం చిన్న చూపుకు గురియ్యాయి. ఉద్యమ కాలంలో తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న అన్ని ప్రజాసంఘాలను ఒక తాటిపైకి తీసుకురావడంలో జయశంకర్‌ ‌సార్‌ ‌సఫలీకృతుడయ్యాడు. జయశంకర్‌ ‌సార్‌కు రాజకీయ పార్టీలపట్ల ఏనాడు నమ్మకంలేదు. కానీ ప్రజా సంఘాలను బలంగా విశ్వసించేవాడు. పాలకులకు ప్రజాసంఘాల పట్ల ఆ విశ్వాసం లేదు. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాలంలో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను విడమర్చి చెప్పి తెలంగాణ పీడిత ప్రాంతానికి ఒక పోరాట దారిని చూపించి తన జీవితాన్ని మొత్తం తెలంగాణ సమాజానికి అంకితం చేసిన దార్శనికుడు ఆచార్య జయశంకర్‌ ‌సార్‌. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షిగా ఉండి అడుగడుగున ఆంధ్రా పాలకుల ఆధిపత్యాన్ని, తెలంగాణకు వివిధ రంగాలలో జరుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో సహా సమాజము ముందు, సమైక్య పాలకుల ముందు వుంచిన ఒక శక్తివంతుడైన ప్రజా మేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ‌గారు. తన 76 ఏళ్ళ. జీవితంలో 60 ఏళ్ళు తెలంగాణ స్వతంత్ర వ్యక్తిత్వం గురించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసిన అసాదరణ ఆలోచనపరుడు, ఆచరణశీలి జయశంకర్‌ ‌గారు. తెలంగాణ పరిధికే పరిమితం కాకుండా వ్యక్తిగా సరిహద్దులు లేని సకలజనుల స్నేహశీలి. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుండి మొదలుకొని పెద్దల వరకు అందరిని అప్యాయతతో పలకరించుకుంటూ కలగలపుకొని సాధా సీదా జీవితాన్ని గడిపిన గొప్ప మానవతామూర్తి. సమాజములోని సబ్బండ వర్గాల సమస్యల పట్ల ఉద్వేగపూరితంగా స్పందించే ఉత్తమ వ్యక్తిత్వం జయశంకర్‌ ‌సార్‌ది. విద్యార్థిగా, పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, విశ్లేషకుడిగా, విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఆయన సేవలు అభినందనీయం. జయశంకర్‌ ‌సార్‌ అధ్యాపకుడిగా సఫలీకృతుడయ్యాడనేది అక్షర సత్యం. తను ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడానికి కారణం ఆ వృత్తి ద్వారా ప్రజలకు చేరువై జనాన్ని జాగృతం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిరూపించాడు. ఉపాధ్యాయుడు రాజకీయవేత్త కాదు కాని ఉద్యమానికి ఉత్ప్రేరకాన్ని ఇస్త్తాడు. అందుకే జయశంకర్‌ ‌గారు రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజానాయకుడిగా కొనసాగాడు. ఒక తరగతి ఉపాధ్యాయుడు ఒక ప్రాంత ఆశయాలను ఫలింపజేయడానికి వారు చమటోడ్చిన తీరు వెలకట్టలేనిది.

Professor Jayashankar's Memorial1950 తొలినాళ్ళలో పుట్టిన తెలంగాణ అనే నిప్పురవ్వను 60 సం।।రాలపాటు ఆరకుండా జ్వలింపచేసి అగ్గిరాజేసిన ఆచార్యుడు జయశంకర్‌ ‌గారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షతల మీద, ప్రాంతీయ అసమానతలపై శాస్త్రీయమైన పరిశోధనలు చేసి అనేక రూపాలలో తెలంగాణ సమాజంతో పంచుకున్న మహానీయుడు. 1953లో విద్యార్థి దశలోనే తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని ఫజల్‌అలీ కమీషన్‌ ‌ముందు ఉంచినారు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం దాని అపజయానికి గల కారాణాలను, ఆనాటి వలసాదిపత్య పాలకుల కుట్రలను పసిగట్టడంతోపాటు మళ్ళి తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని పునరుద్దరించడానికి అనేక అన్వేషణలు చేసి పలు సంస్థలు తెలంగాణ ఆకాంక్షలను వ్యక్తికరించేటట్లు ఆలోచనలు చేసినాడు. 1969 తర్వాత నెలకొన్న స్తబ్దతను మెల్ల మెల్లగా చేదించుకుంటు తెలంగాణ వాదాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి, ప్రజలందరిని భాగస్వాములను చేయడానికి జయశంకర్‌ ‌గారు మూడు (3) సూత్రీకరణలు చేశారు. 1) భావజాల వ్యాప్తి (2) ఉద్యమ నిర్మాణం (3) రాజకీయ ప్రక్రియ ఈ మూడు అంశాల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయడానికి జయశంకర్‌ ‌సార్‌ ఆలోచన సముహారంతో 2004లో ఏర్పడిన సంస్థే తెలంగాణ విద్యావంతుల వేదిక. తెలంగాణ రాష్ట్ర సాధనలోను, రాష్ట్ర ఏర్పాటు అనంతరము కూడా ప్రజలు కేంద్రంగా విద్యావంతుల వేదిక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని జయశంకర్‌ ‌గారు అభిప్రాయపడినారు. స్వరాష్ట్ర ఏర్పాటుకే పరిమితం కాకుండా ఏర్పడే నూతన రాష్ట్రంలో అభివృద్ది ఫలాలు ప్రజలందరికి అందేలా తెలంగాణ విద్యావంతుల వేదిక వాచ్‌డాగ్‌ ‌లాగా పని చేయాలని సూచించారు. అందులో భాగంగానే టివివి తెలంగాణ ఉద్యమాన్నే ఊపిరిగా భావిస్తూ జయశంకర్‌ ఆలోచనల కొనసాగింపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

తెలంగాణ ఉద్యమం ప్రజాచైతన్యం, రాజకీయ చైతన్యం పునాధిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసింది. ఉద్యమానికి ఊపిరి ఊదడంలో, ప్రజలను ఉద్యమం వైపు మరల్చడంలో ప్రజాసంఘాలు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ నినాదం అయిన నీళ్ళు, నిధులు, నియామకాల విషయాలలో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన హామీలు ఇచ్చి ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామికబద్దమైన పరిపాలన కొనసాగుతుందని భావించినాము, కానీ ఆచరణలో అమలు కాలేదు. ఉద్యమ ట్యాగ్‌ ‌లైను అయిన నీళ్ళ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగానైతే జల దోపిడి కొనసాగిందో అదే విధమైన జల దోపిడి స్వరాష్ట్రంలో యధేచ్చగా కొనసాగుతున్నా అధికారంలో ఉన్న పార్టీ గొంతెత్తి కొట్లాడిన దాఖలాలు లేవు. ఆనాడు నీళ్ళ విషయంలో నిలబడి నినదించిన జయశంకర్‌ ‌సార్‌ ‌స్పూర్తిని నేడు స్వరాష్ట్ర పాలకులు విస్మరిస్తున్నారు. ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కాంట్రాక్టర్ల, కార్పొరేట్‌ ‌శక్తుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజల నుంచి భూమిని సేకరించే విషయంలో, పరిహారం విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తూ లాఠీలు జులుపించి లాక్కుంటున్నారు. ఇలాంటి దుర్ఘటనలను జయశంకర్‌ ‌సార్‌ ఏనాడు సహించలేదు. సమైక్య పాలనలో ఉపాధి అవకాశాలు లేకనే చనిపోతున్నామని ఉద్యమ సమయంలో వందల మంది యువకులు విద్యార్ధులు సూసైడ్‌ ‌నోట్‌లు రాసి అమరులయ్యారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మా తర్వాతి తరం వారికి అన్యాయం జరగవద్దు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించారు. జయశంకర్‌ ‌బ్రతికున్న కాలంలో అనేక కమీషన్లకు, కమిటిలకు ఉద్యోగాలలో తెలంగాణ వారికి జరుగుతున్న అన్యాయాన్ని శాస్త్రీయమైన నివేధికల రూపంలో సమర్పించినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లయినా ఆంధ్రా ఉద్యోగులు ఇంకా ఇక్కడ కొనసాగుతూనే ఉన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య జఠిలమై కూర్చున్నది. అయినా ఉద్యోగాల కల్పన విషయంలో ( పోలీస్‌ ఉద్యోగాలు మినహా ) పాలకులకు ఏ మాత్రం చిత్తశుద్ది లేదని నిరూపితమైంది.రాష్ట్ర ఏర్పాటు అనంతరం యువతకు ఉద్యోగాల విషయంలో ఇంత అన్యాయం జరుగుతందని జయశంకర్‌ ‌సార్‌ ‌కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. నిధుల విషయానికి వస్తే 60 ఏండ్ల లోపు సమైక్య పాలకులు చేయని అప్పులు 6 ఏండ్లలో చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టివేసినారు అనడంలో ఏలాంటి నిస్సందేహం లేదు. స్వరాష్ట్రంలో మన నిధులు మనకు దక్కినా వాటిని వివిధ రంగాలకు •కేటాయించడంలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించకుండా ముఖ్యమంత్రి తనకు నచ్చిన విధంగా నోటికి వచ్చిన విధంగా ప్రకటించి కాంట్రాక్టర్ల ప్రయోజనం కొరకు విధాలను రూపొందించడం జరిగిందనేది వాస్తవం. ఇలాంటి విధానాలు జయశంకర్‌ ఆలోచనలకు విరుద్ధం. వచ్చిన ప్రతి రూపాయను తెలంగాణ అభివృద్ది కోసం ఖర్చు చేయాలి, ఆ అభివృద్ది ఫలాలు ప్రజలందరికి దక్కాలని జయశంకర్‌ ‌సార్‌ అనేక వేధికలపై ఉపన్యసించిన తీరును యాది మరువలేం. నేటి స్వయం పాలకులు వారి మాటలను ఏ మాత్రం ఖాతారు చేయకుండా నిధులను దుర్వినియోగం చేస్తునది స్పష్టం.

తెలంగాణ ఏర్పాటు అనంతరం ఎన్నికల తరుణంలో ఉద్యమ పార్టీగా టి.ఆర్‌.ఎస్‌. ‌పార్టీ రూపొందించుకున్న మ్యానిప్యాస్టోలో ప్రజాసంఘాలను, పౌరసమాజాన్ని గౌరవిస్తాము, వారి సలహాలు సూచనలు తెలంగాణ అభివృద్ది కోసం తీసుకుంటామని ప్రకటించి నేడు ప్రజాసంఘాలను పరిగణలోకి తీసుకోకపోవడం అనేది తెలంగాణ రాజకీయాలలో ఒక వైరుద్యమైన కోణం. రాజకీయ పార్టీల కంటే రెట్టింపుగా తెలంగాణ సమాజంలోని మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, సాంస్కృతిక సంఘాలు తమ రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా, పాటల ద్వారా, రాష్ట్ర ఆవిర్భావం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాయి. కానీ తదనంతర కాలంలో ప్రజాసంఘాలు, పౌరసమాజం చిన్న చూపుకు గురియ్యాయి. ఉద్యమ కాలంలో తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న అన్ని ప్రజాసంఘాలను ఒక తాటిపైకి తీసుకురావడంలో జయశంకర్‌ ‌సార్‌ ‌సఫలీకృతుడయ్యాడు. జయశంకర్‌ ‌సార్‌కు రాజకీయ పార్టీలపట్ల ఏనాడు నమ్మకంలేదు. కానీ ప్రజా సంఘాలను బలంగా విశ్వసించేవాడు. పాలకులకు ప్రజాసంఘాల పట్ల ఆ విశ్వాసం లేదు.
పై విషయానుసారం ప్రకారం జయశంకర్‌ ‌సార్‌ ‌కలలు కన్న తెలంగాణ పున:నిర్మాణం లక్ష్యం దెబ్బతింటుంది, ప్రజాస్వామ్య వెలితి స్పష్టంగా కనిపిస్తుంది, సామాజిక సాంస్కృతిక రంగాలనుకుట్ర పూరితంగా అణచివేస్తున్నారు. ఎన్నికల రాజకీయాలలో ప్రజాస్వామిక చర్చలను, సామాజిక లోటుపాట్లపైన సందిస్తున్న ప్రశ్నల విషయంలో స్వయం పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నియంతృత్వ ఆలోచనలను జయశంకర్‌ ‌గారు ఏనాడు సహించలేదు. తెలంగాణ ఏర్పడిన 6 వసంతాల కాలంలో ఇచ్చిన హామిలను, చేసిన పనులను, ప్రజల ఆకాంక్షలను, లక్ష్యాలను అవలోకనం చేసుకోవడం అంటే జయశంకర్‌ ‌సార్‌ ‌కొనసాగించిన విలువలను, ప్రతిష్టతను, వారి రాజీ లేని పోరాటాన్ని, నిరాడంబరతను, నిజాయితీని, నిబద్దతను, వారి స్పూర్తిని, వారి ఆలోచనలను కొనసాగించడమే. ఆ వైపుగా ముందుకు సాగడమంటే తెలంగాణ జన జీవనంలో జయశంకర్‌ ‌సార్‌ ‌కృషి ఫలించినట్లేనని తెలంగాణ విద్యావంతుల వేధిక అభిప్రాయ పడుతుంది.
– పందుల సైదులు
9441661192

Leave a Reply