Take a fresh look at your lifestyle.

ఎన్‌ ఎల్‌ ఎస్‌ ఏ ‌సభ్యురాలిగా ప్రొఫెసర్‌ ‌బీనా చింతలపూరి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,జూలై 30: నేషనల్‌ ‌లీగల్‌ ‌సర్వీసెస్‌ అధారిటీ( ఎన్‌ ఎల్‌ ఎస్‌ ఏ) ‌సభ్యురాలిగా తెలంగాణకు చెందిన ప్రొఫెసర్‌ ‌బీనా చింతలపూరి నియమితులయ్యారు.కేంద్ర గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌ప్రకారం ఈ నియామకం జరిగింది. చట్టంలో నిర్ధేశించిన విధంగా నియామకాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను కేంద్ర ప్రభుత్వం సంప్రదించింది. జైళ్లు, ఖైదీలకు సంబంధించి సంస్కరణల కోసం విశిష్ట కృషి చేసి సత్పలితాలను సాధించిన ప్రొఫెసర్‌ ‌బీనా చింతలపూరి నియామకానికి జస్టిస్‌ ‌రమణ అనుకూలంగా స్పందించారు . ఉస్మానియా యూనివర్శిటీలో సైకాలజీ ప్రొఫెసర్‌ ‌గా పనిచేసిన బీనా చింతలపూరి.

జైలు నుంచి విడుదలైన ఖైదీల మనస్తత్వాలపై అనేక పరిశోధనలను చేయడమే కాకుండా, ఖైదీలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అనేక వర్క్ ‌షాపులు నిర్వహించారు. చింతలపూరి బీనా తరగతులకు హాజరై జీవితాన్ని మార్చుకున్న వేలాదిమంది ఖైదీలు వున్నారు. సీనియర్‌ ‌న్యాయవాదులు మీనాక్షి అరోరా, కెవి. విశ్వనాధన్‌, ‌సిద్ధార్ధ లూధ్రలతో పాటు సామాజిక కార్యకర్త ప్రతి ప్రవీణ్‌ ‌పాట్కర్‌ ‌లు కూడా సభ్యులుగా నియామకం అయ్యారు. సిజె ఐ ఎన్వీ రమణ తోడ్పాటుకు ప్రతీక ధన్యవాదాలు బీనా చింతలపూరి తెలిపారు.

Leave a Reply