గందరగోళం లేకుండా చూడాలి
ఇసిని కలసి ఫిర్యాదు చేసిన కోదండరామ్
ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల ప్రధానాధికారిని కలిసి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ కోదండరాం, ఉపాధ్యక్షుడు ప్రో. ఎల్. విశ్వేశ్వర్ రావు.. వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో రాత్రి సమయంలో గొడవ చేసి అధికారులపై ఒత్తిడి చేయాలనే కుట్ర అధికార పార్టీ చేస్తోందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని.. కౌంటింగ్ పక్రియను తమ వైపు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారన్నారు.
తమకున్న సమాచారంతో ఎన్నికల కమిషనర్ని కలిశామన్నారు. విచారించి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి హావి• ఇచ్చారు. ఇదిలావుంటే నల్గొండపట్టభద్రుల ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. 6వ నెంబర్ కౌంటింగ్ సెంటర్లో 8 బాక్సులకు సీల్ లేదని బీజేపీ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. ఓ బ్యాలెట్ బాక్స్‌కు తాళం పగులగొట్టి ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాళాలు సరిగా తెరుకోకపోవడంతోనే ఏజెంట్లముందే పగులగొట్టామని కౌంటింగ్ అధికారులు చెబుతున్నారు. 6వ నెంబర్ కౌంటింగ్ సెంటర్‌తోపాటు 7,8 కౌంటింగ్ హాల్లో కూడా 10 నుంచి 20 బాక్సులకు సంబంధించి కొన్ని తాళాలు పగులగొట్టి ఉండడం, బాక్సులు కొంచెం తెరుచుకుని ఉండంతో మిగతా పార్టీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అయితే అన్ని సరిగ్గా ఉన్నాయని అధికారులు సర్ధి చెప్పడంతో ఏజెంట్లు శాంతించారు. దీంతో కౌంటింగ్ పక్రియ మొదలైంది.