Take a fresh look at your lifestyle.

ఐక్య భారత నిర్మాత – సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌

1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించిన సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌  ‌గొప్పస్వాతంత్య్య్ర సమరయోధుడు. స్వాతంత్య్రా నంతరం ఆయన తొలి ఉపప్రధానిగా అలాగే సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.భారతదేశ చరిత్రలో పటేల్‌ ‌ను ఒక  అశోకుడితో,ఒక అక్బర్‌ ‌తో  పోల్చవచ్చు. మౌర్య సామ్రాజ్యంలో అశోకుడిలాగ, మొఘల్‌ ‌సామ్రాజ్యంలో అక్బర్‌ ‌లాగా అఖండ భారతదేశాన్ని ఒక్కటిగా చేసిన గొప్ప పరిపాలకుడు పటేల్‌.‌భారత స్వాతంత్ర సమరంలో ఆయన  ప్రత్యక్షంగా పాల్గొన్న బార్డోలి సత్యాగ్రహం నుండి దేశస్వాతంత్రం ,దేశ విభజన అలాగే దేశ విభజ నానంతరం చోటు చేసుకున్న పరిణామాలయిన  శరణార్ధుల సంరక్షణ,మత సంఘర్షణలు ,దేశ రక్షణ, అవినీతి మొదలై నటువంటి క్లిష్టమైన అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపా లించి భౌగోళికంగా అదే విధంగా ఇతర సామాజిక అంశాలపరంగా కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కెల్లాఅనేక రకాల విభిన్న కోణాలను  కలిగి ఉన్న భారతదేశంలోని వివిధ సంస్థానాలను తన ఉక్కుసంకల్పంతో అఖండ భారత దేశాన్ని ఏకం చేసిన భారతీయ బిస్మార్క్ ‌సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌.
‌జాతీయోద్యమ చరిత్ర లో 1931 లో జరిగిన కరాచీ కాంగ్రెస్‌ ‌సమావేశానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మౌలిక హక్కులు, ఆర్థిక కార్యక్రమాల విషయంలో ఈ కరాచీ సమావే శంలో తీసుకున్న తీర్మానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కాంగ్రెస్‌ ఆవిర్భావం నుంచి ప్రజల యొక్క రాజకీయ, పౌర, ఆర్థిక హక్కులకోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రజలపరంగా స్వరాజ్యం అంటే ఏమిటో  తొలిసారిగా ఈ సమావేశం విశ్లేషిం చింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌కావడం విశేషం.దేశ స్వాతంత్రం అంటే కేవలం రాజకీయంగా మాత్రమే ఉండకూడదని  పటేల్‌ అనేక సామాజిక అంశాల మీద కూడా స్వాతంత్య్ర పోరాటాన్ని కొనసాగించాడు. మద్యపాన నిషేధం, కులమతాల విభేదాలు ,విద్య మొదలైన అంశాలపైన ఆయన దృష్టి సాధించారు.

సంస్థానాల విలీనం:
మన దేశం యొక్క సంక్లిష్టమైన వైవిధ్యం చాలా గొప్పది. మన దేశంలో అనేక రకాల భాషాపరమైన ,సాంస్కృతిక పరమైన భౌగోళిక మరియు ఆర్థికపరమైనటువంటి విభిన్నతలు ఎన్నో ఉన్నాయి.ఇన్ని రకాల విభిన్నతలున్నా భారతదేశ జాతీయత మూలాలు చరిత్ర లోతుల్లోనూ, స్వతంత్ర పోరాట అనుభవం లోనూ ఉన్నాయి. పరిపాలన ,రాజకీయ, ఆర్థిక పరమైన ఐక్యతకు సంబంధించినటువంటి అంశాలు ప్రత్యేకంగా మొగలుల కాలంలో కొంత వరకు అభివృద్ధి చెందాయి.ఆ తర్వాత  బ్రిటిష్‌ ‌వారి  విభజించి పాలించే  విధానం కారణంగా భారత జాతి సమైక్యత చాలా వరకు దెబ్బతింది. పటేల్‌ ‌భారత జాతి ఏకీకరణ భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను కేంద్ర బిందువుగా చేసుకుని చేశాడు.  కేవలం 80 మంది జనాభాను కలిగి ఉన్న బిల్బారి సంస్థానం మొదలుకొని ఇటలీ దేశం కంటే వైశాల్యం లో పెద్దదైన ,దేశంలోనే అతి సంపన్నమైన హైదరాబాద్‌ ‌నిజాం సంస్థానం వరకూ దేశంలో ఉన్న 560 సంస్థానాలన్నింటినీ విలీనం చేయడంలో పటేల్‌ ‌తన రాజనీతిని ప్రదర్శించారు.

సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌సంస్కరణలు:
స్వాతంత్య్రానంతరం దేశ విభజన వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా దాదాపు వంద సంవత్సరాలుగా బ్రిటిష్‌ ‌వారిచేతిలో ఉన్న పరిపాలనను సొంతం చేసుకున్న తర్వాత దానిని పారదర్శకంగా ప్రజలకు అందించడం అతి పెద్ద సవాలు. సువిశాల భారతదేశంలో అనేక విభిన్నతలున్నప్పటికీ వీటన్ని ంటిని పటేల్‌  ‌సమైక్యస్ఫూర్తితో పరిపాలించడానికి సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌వ్యవస్థను సంస్కరించి దేశ పరిపాలనలో ఒక ఉక్కు చట్రం లాగా దాన్ని రూపొందించారు.భారతదేశంలో ఎంత వైవిధ్యం ఉన్నా జాతి మొత్తం ఒకటే పరిపాలన వ్యవస్థ ఉండాలని ఆయన బలంగా విశ్వసించారు. సర్దార్‌ ‌పటేల్‌ ‌చేసిన అన్ని కార్యక్రమాలు భారతదేశం ఏకతా స్ఫూర్తిని రగిలించేవిగానే ఉంటాయి. సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌వ్యవస్థ ఇప్పుడు మనదేశంలో లేకపోయి ఉంటే దేశ పరిస్థితిని ఊహించడం చాలాకష్టం. పటేల్‌ ‌సంస్కరించడం  ద్వారా సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌నాటినుండి నేటికీ ,అదే విధంగా భవిష్యత్తులో కూడా భారత దేశ అభివృద్ధికి అవేమూలాలు. వలసపాలన వల్ల భారతదేశం అనేక రకాలుగా చిన్నాభిన్నం అయినప్పటికీ స్వాతంత్రానంతరం ఉన్న కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలోని అగ్ర దేశాలకు సమానంగా మన దేశం అభివృద్ధి చెందుతుందీ.. అంటే దానికి సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌వ్యవస్థే కారణమని చెప్పవచ్చు. దేశానికి మొదటి హోం శాఖ పదవిని చేపట్టిన పటేల్‌ ‌త్రివిధ దళాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించడం ద్వారా రక్షణ రంగంలో ఆయన  దార్శనికత వలనే నేడు  మన దేశం రక్షణ వ్యవస్థ లో ప్రపంచంలోని మొదటి పది దేశాల సరసన ఉంది.

భారతదేశాన్ని అక్బర్‌ ‌దాదాపుగా నాలుగు దశాబ్దాలు పరిపాలించాడు బ్రిటిష్‌ ‌వారు ప్రత్యక్షంగా 100 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు కానీ సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌కేవలం తన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఆ సమయంలో స్వాతంత్య్రానంతరం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలనీ, నేడు మనం ఎదుర్కొంటున్న , భవిష్యత్తులో రాబోయే సమస్యలకు కూడా పరిష్కారం చూపిన గొప్ప ముందుచూపు కలిగిన నేత సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ .ఆయన  యొక్క పరిపాలన తాత్వికత నేటికీ చాలా అవసరం. పటేల్‌ ‌యొక్క రాజనీతి నుంచి పాలకులు మరియు అధికారులు ఎన్నో విషయాలు నేర్చుకుని వాటిని పాటించాలి. స్వాతంత్రానంతరం చెల్లాచెదురుగా ఉన్న అనేక స్వదేశీ సంస్థానాలను ఆయన ఉక్కు సంకల్పంతో ఏకంచేసి జాతీయైక్యత చాటాడు. పటేల్‌ ‌స్వతంత్ర పోరాటానికే కాకుండా నవభారత నిర్మాణానికి కూడా రూపకర్తగా వ్యవహరించాడు.ఆయన ఉక్కు సంకల్పానికి దేశం ఆయన్ని ‘ఐరన్‌ ‌మాన్‌ ఆఫ్‌ ఇం‌డియా’ గా పిలిచి గర్వించు కుంటోంది. ఆయన జన్మదినాన్ని నేడు ‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌’ ‌గా జరుపుకుంటున్నాము. సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌పరిపాలకుడిగా లేని భారతదేశాన్ని ఊహించడం చాలా కష్టం. కొంతమంది ఉత్తమమైన పరి పాలకుల ఉంటారు కానీ వారిలో ముందుచూపు ఉండదు. కాబట్టి ఒక గొప్ప పరిపాలకుడిగా పటేల్‌ ‌నేటి తరాలకు ఆదర్శం.
– ఆదిత్య పకిడే
8309639787
pakideadithya@gmail.com

Leave a Reply