Take a fresh look at your lifestyle.

పిసిసి అధ్యక్షుడి ఎంపిక పక్రియ మొదలైంది

  • పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది
  • బిజెపి, టిఆర్‌ఎస్‌లది గల్లీలో కుస్తీ..ఢిల్లీలో దోస్తీ
  • రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్
తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎం‌పిక పక్రియ ప్రారంభించామని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌తెలిపారు. ఇప్పటి వరకు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామని అన్నారు. తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తెలుసుకున్నామని ఢిల్లీలో సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించామన్నారు. సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్‌ ‌గాంధీలకు అందజేస్తానని వెల్లడించారు.
ఈ కసరత్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని టాగూర్‌ ‌చెప్పుకొచ్చారు. తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. తమ సంప్రదింపుల్లో ’పీసీసీ చీఫ్‌ ఎవరైతే బాగుంటుందో చెప్పాలని’ నేతల్ని కోరామని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎవరికైనా పీసీసీ ఎంపిక కసరత్తుపై ఇబ్బందిగా ఉంటే నేరుగా పార్టీ అధిష్ఠానాన్ని కలవొచ్చని సూచించారు. టీఆర్‌ఎస్‌-‌బీజేపీ వైఖరి ఢిల్లీలో దోస్తీ-గల్లీ మే కుస్తీ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌-‌మోదీ భేటీ ద్వారా ఈ విషయం తెలుస్తోందని అన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ ‌నేతలపై మరో 6 నెలల పాటు ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని అర్థమైందని టాగూర్‌ ‌తెలిపారు.

Leave a Reply