Take a fresh look at your lifestyle.

క్షేత్ర సహాయకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఉపాధి హామీలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. సోమవారం ఆత్మకూర్‌ ‌మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం ముందు ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరహార దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు విధించిన 30శాతం పని దినాల సర్కూలర్‌ ‌మూలంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఉనికిని కోల్పొయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్ట్ ‌రెన్యూవల్‌ ‌చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 3నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం చట్టం ప్రకారం నెలకు 21వేల రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఎఫ్‌ఏహెచ్‌ఆర్‌ ‌పాలసీని సవరిస్తు ఉపాధి హామీలో పని చేస్తున్న మిగత అన్ని స్థాయి ఉద్యోగుల మాదిరిగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఎఫ్‌టిఈలుగా గుర్తించి ప్రమోషన్‌, ‌బదిలీలు, హెల్త్ ‌కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో తడకమళ్ల శేఖర్‌, ‌కొరివి అంజయ్య, పరమేష్‌, అం‌జమ్మ, భాస్కరచారి, రాజశేఖర్‌, శ్రీ‌ను, ఎల్లయ్య, విమల, శంకర్‌, ‌లింగయ్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply