Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..!

  • జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
  • టీయూడబ్ల్యుజే  (ఐజేయు)   ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద  సత్యాగ్రహ దీక్ష.
పాత్రికేయుల జీవితాలను చిదిమివేస్తున్న కొరోనా నుండి భద్రతా కల్పించాలనే డిమాండుతో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శుభాష్ కాలనిలో ని గాంధీజీ  విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,జిల్లా కమిటి ఆద్వర్యంలో  సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. అనంతరం పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ తెలంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి,లాఠీ దెబ్బలు తిన్నప్పటికి తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్ట్ లను పట్టించుకోవడం లేదని,రాష్ట్రంలో 12మంది జర్నలిస్టులు కొరోనా కాటుకు బలైపోగా, 1100 మంది మీడియా సిబ్బందికి, 2,600మంది వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకినప్పటికి ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్ట లేదని, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయక చర్యలు లేకపోవడం విచారకరమని, బాధిత కుటుంబాలకు
రూ.50 లక్షల ప్రభుత్వ సహాయం అందించాలని, కోవిడ్ వారియర్స్ గా నిలిచిన జర్నలిస్టులకు రూ.50లక్షల బీమా వర్తింపజేయాలని, కొరోనా సోకిన జర్నలిస్టులకు కార్పోరేట్ హాస్పిటల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే డిమాండుతో  కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ హజీమ్  కు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో టియుడబ్ల్యూ  జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సామంతుల శ్యామ్, జనరల్ సెక్రటరీ క్యాతం సతీష్ కుమార్,కోశాధికారి చింతల  కుమార్ యాదవ్, రాష్ట్ర కమిటి సభ్యడు సామల శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షుడు రవితేజ, జాయింట్‌ సెక్రటరీ చంద్, సీనియర్ జర్నలిస్టులు రాచర్ల ప్రభాకర్,సమ్మయ్య గౌడ్, జర్నలిస్టు లు ,రజినికాంత్, మేడారం సమ్మయ్యగౌడ్,పవన్,జగన్,వెంకటేశ్వర్లు, రమేష్,రవి,సాంబయ్య, ఉదయ్, విజయ్ తదితరులు పాల్గోన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐతే ప్రకాష్ తో పాటు  కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply