Take a fresh look at your lifestyle.

ఫీల్డు అసిస్ట్ట్లెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Problems of field assistants should be addressed immediately

ఫీల్డు అసిస్ట్ట్లెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలనీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ‌యూనియన్‌ ‌నర్సంపేట డివిజన్‌ ‌నాయకులు నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. బుదవారం తెలంగాణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ ‌యూనియన్‌ ‌స్టేట్‌ ‌కమిటీ జేఏసీ కార్యాచరణకు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఎంపీడీవో, ఏపీఓలకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మండలం ఫీల్డ్ అసిస్టెంట్స్ ‌యూనియన్‌ ‌మండల కమిటీ ఎంపీడీవో నాగేశ్వరరావు, ఏపీవో ఫాతిమా మేరీకి వినతి పత్రం అందజేశౄరు. ఈ సందర్బంగా నర్సంపేట డివిజన్‌ ‌నాయకులు నాగరాజు మాట్లాడుతూ మార్చి 11వ తేదీ లోపు ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేనియెడల సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు. 4779 జీఓ రద్దు చేయాలని, పర్సంటేజ్‌ ‌విధానాన్ని రద్దు చేయడమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తూ 21 వేల వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. దానితోపాటు ఈఎస్‌ఐ, ‌పీఎఫ్‌ ‌సౌకర్యాలను కల్పిస్తూ ప్రమాద బీమా 10 లక్షలకు పెంచాలని కోరారు. లేనియెడల నిరసనను సమ్మె రూపంలోకి తీసుకొస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంపయ్య, చందర్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌, ‌సతీష్‌, ‌సారయ్య, ఎల్లయ్య, లక్ష్మి, హేమలత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply